టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగా పవన్ కళ్యాణ్.. టీటీడీ కార్పోరేషన్ ఏర్పాటుపై ప్రశ్నాస్త్రాలు!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ ఉద్యోగులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తీవ్ర ఆందోళనలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిష్కరించాలని కోరుతున్నాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో పని చేసే కాంట్రాక్టు , అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈ విషయంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టనుంది టీటీడీ.

టీటీడీలో కార్పోరేషన్ ఏర్పాటు .. టెన్షన్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులు
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీటీడీ లో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకునే క్రమంలో టిటిడి తెరమీదకి కొన్ని షరతులను తీసుకువచ్చింది. టీటీడీలో గడువు ముగిసిన కాంట్రాక్టులను పొడిగించవద్దని, అలాగే కొత్తగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీలు, ఇతర సంస్థలకు ఉద్యోగులను నియమించరాదని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఉన్న సొసైటీలను రద్దు చేసి, కార్పొరేషన్ ఏర్పాటు దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగాలకు ఎసరొస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సొసైటీలుఉండగా కార్పోరేషన్ దేనికని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
ఆందోళనలో ఉన్న టిటిడి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ 2010లో టిటిడి 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని, అదేవిధంగా సొసైటీలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్ ఎందుకు అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఉన్న వ్యవస్థను మార్చే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని కానీ ఈ అంశం లో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని, ఘోరంగా విఫలం చెందుతోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

కాంట్రాక్ట్ కార్మికులను ఇబ్బంది పెట్టే నిర్ణయం అన్న పవన్ కళ్యాణ్
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నాయని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తోందని మండిపడ్డారు . రాష్ట్రంలో ఇసుక పాలసీ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల వ్యవహారం ఇలాంటిదేనని ఆరోపించారు. ఆ రీతిలోనే 73 సంఘాలను రద్దు చేసి కార్పొరేషన్ గా మార్చడం ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చే దారుణమైన చర్య అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పొమ్మనకుండా పొగ పెట్టారని, దీనిని అలానే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వేతనాల విషయంలోనూ సుప్రీం తీర్పును ఉల్లంఘించిన వైసీపీ సర్కార్
అంతేకాదు ఒకే పనిచేస్తున్న రెగ్యులర్ కార్మికులకు కానీ టెంపరరీ కార్మికులకు కానీ ఒకే వేతనం చెల్లించాలని జస్టిస్ జేఎస్ ఖేహార్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు 2016లో వెలువరించిన తీర్పును పూర్తిగా విస్మరించారని, వైసీపీ ప్రభుత్వం ఆ తీర్పును ఉల్లంఘించిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ లో చేరని ఉద్యోగులను మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్, కాంట్రాక్టు ఉద్యోగులను కార్పొరేషన్లో చేరాలని బలవంత పెట్టడం శ్రామిక చట్టాలను ఉల్లంఘించటం కాదా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
Recommended Video

కార్పోరేషన్ ఏర్పాటు నిధులు దారి మళ్ళించటానికేనా ?పవన్ ప్రశ్న
కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిధులు దారి మళ్ళించడం కోసమేనా? బోర్డును నియమించే హక్కు ఎవరికి ఉంది? ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా? ఇవన్నీ సామాన్యుడి మదిలో ఉదయిస్తున్న ప్రశ్నలని పేర్కొన్న పవన్ కళ్యాణ్ 4 వేల మంది ఉద్యోగులకు మద్దతు కల్పించాలన్న ఉద్దేశ్యం వైసీపీ సర్కార్ కు లేదని, అలాంటప్పుడు వారికి పాదయాత్రలో ఎందుకు హామీ ఇచ్చిందని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ తమకు అండగా ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు .
-
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక -
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications