పవన్ డిక్లరేషన్ వెనుక - పక్కా వ్యూహాం..!!
పవన్ కల్యాణ్. తిరుపతి వేదికగా కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత పవన్ కల్యాణ్ ఎర్రటి కవర్ పేజ్ పై ధర్మో రక్షతి రక్షితః అనే పెద్దక్షరాలతో కూడిన వారాహి డిక్లరేషన్ చూపించారు. ఈ రోజు జరిగే వారాహి సభలో పవన్ ఈ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. ఇందులో ఏముంది. కేంద్రానికి ఏం సూచన చేయబోతున్నారు. అయితే, అంతా పక్కా ప్లాన్ ప్రకారమే పవన్ అడుగులు వేస్తున్నారు.
తిరుపతి వేదికగా పవన్ కల్యాణ్ తిరుపతి వేదికగా ఈ రోజు కీలక ప్రకటన చేయబోతున్నారు. తిరుమల లడ్డూ వివాదం బయటకు వచ్చిన సమయంలో పవన్ తీవ్రంగా స్పందించారు. సనాతన బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెర మీదకు తెచ్చారు. లడ్డూ అపవిత్రం అయిందని..ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత దీక్ష విరమించారు. ఈ రోజు తిరుపతి సభలో ప్రకటించే డిక్లరేషన్ పైన ఆసక్తి కొనసాగుతోంది. పవన్ శ్రీవారి పాదాల వద్ద డిక్లరేషన్ ఉంచారు.

తిరుమల మాడవీధుల్లో నడుస్తున్నప్పుడు కూడా పవన్ చేతిలో ఎర్రటి డిక్లరేషన్ తో కనిపించారు. డిక్లరేషన్ ద్వారా పవన్ సనాతన ధర్మం అమలులో భాగంగా కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పవన్ డిమాండ్ కు మద్దతుగా సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అనే పేరుతో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కూడా ఉంది. ఇవాళ సాయంత్రం తిరుపతిలో జరిగే వారాహి సభలో వారాహి డిక్లరేషన్ విడుదల కానుంది. ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా తనను విమర్శించిన ప్రకాశ్‌రాజ్ అండ్ అదర్స్‌కి వారాహి సభలో సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది.
హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే బీజేపీ నేతలు సైతం ఈ రోజు పవన్ ప్రకటించే డిక్లరేషన్ వైపు ఆసక్తి గా చూస్తున్నారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లోని కొందరు నేతలు సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యల పైన పవన్ స్పందించే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఏపీతో పాటుగా కేంద్రానికి సనాతన ధర్మం పరిరక్షణ కోసం కొన్ని నిర్దిష్ట అంశాలను ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా రాజకీయంగా కంటే పవన్ ఈ డిక్లరేషన్ తో సనాతన ధర్మం గురించి చెప్పే అంశాల పనే దేశ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications