Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ఇలాకాలో పవన్ సత్తా చాటేనా: సీఎం లక్ష్యంగా సీమ పర్యటన: బాలకృష్ణ అడ్డాలోనూ..!

ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి ఆరు నెలల కాలం పూర్తయింది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాన్ వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన నేరుగా విమర్మనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. ఇసుక..ఇంగ్లీషు మీడియం అంశాల్లో ముఖ్యమంత్రి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు. ఇక, ఇప్పుడు పవన్ కళ్యాన్ కొత్త రాజకీయం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు గోదావరి..విశాఖ జిల్లాల కేంద్రంగా రాజకీయ వ్యవహారాలు నడిపించిన పవన్..ఇప్పుడు జగన్ రాజకీయ అడ్డ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే సీమలో టీడీపీలో గెలుచుకోగా..జగన్ ఏకపక్షంగా విజయ విహారం చేసారు. ఇప్పుడు..అదే రాయలసీమలో ముఖ్యమంత్రి లక్ష్యంగా పవన్ పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో కొంత మంది జనసేనలో చేరుతారని చెబుతున్నారు. రాయలసీమ కేంద్రంగా పవన్ ముఖ్యమంత్రి పైన ఎటువంటి విమర్శలు చేస్తారు..స్పందన ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

జగన్ లక్ష్యంగా సీమలో పవన్ పర్యటన..

జగన్ లక్ష్యంగా సీమలో పవన్ పర్యటన..

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత..తొలి సారి జనసేన అధినేత పవన్ రాయలసీమలో పర్యటిస్తున్నారు. కొంత కాలంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని రాజకీయంగా పవన్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు జగన్ సొంత జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో కర్నూలు..కడప జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. జనసేన ఎక్కడా ఖాతా తెరవలేదు. టీడీపీ సీమ ప్రాంతంలో కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక, ఇప్పుడు అదే రాయలసీమలో పవన్ కళ్యాన్ పర్యటన ఆసక్తి కరంగా మారింది. ఇసుక అంశం..ఇంగ్లీషు మీడియం అంశాల పైన పవన్ నేరుగా ముఖ్యమంత్రి నే లక్ష్యంగా చేసుకున్నారు. అదే సమయంలో సీఎం జగన్ సైతం పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించటం వివాదాస్పదంగా మారింది. ఇక, పవన్ ఇప్పుడు రాయలసీమ పర్యటనలో ఏ అంశాల పైన ప్రస్తావిస్తారు..ముఖ్యమంత్రి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

కడప జిల్లాలో రోడ్ షో.. సభ..

కడప జిల్లాలో రోడ్ షో.. సభ..

రాయలసీమ పర్యటనలో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైల్వేకోడూరులో నిర్వహించే సభను విజయవంతం చేయాలని ఇప్పటికే పార్టీ నేతలు కోరారు. పెద్ద ఎత్తున రోడ్‌షో ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రైల్వేకోడూరు పాత బస్టాండు వద్ద బహిరంగసభ ఏర్పాటు చేసారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద కడప.. అనంత పురం,..చిత్తూరు, నెల్లూరు జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు. రైల్వేకోడూరు కుక్కలదొడ్డి ప్రాంతంలో పవన్‌కళ్యాణ్‌ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసారు.. మార్కెట్‌యా ర్డు వద్ద నుంచి ఓపెన్‌టాప్‌ వాహనంలో పవన్‌కళ్యాణ్‌ అభివాదం చేసుకుంటూ కోడూ రుకు చేరుకుని బహిరంగసభలో ప్రసంగించనున్నారు.

అనంతపురం పర్యటనపై ఆసక్తి..

అనంతపురం పర్యటనపై ఆసక్తి..

జనసేన అధినేత పవన్ రాయలసీమ పర్యటనలో అనంతపురం జిల్లాకు రానున్నారు. సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోనూ పవన్ కళ్యాన్ పర్యటన చేయనున్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న అక్కడి సమస్యల పైన ఏ రకంగా స్పందిస్తారు..బాలకృష్ణ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికల ముందు అనంతపురంలో జరిగిన సభలో తాను అనంతపురంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తానని..ఆ జిల్లా నుండే పోటీ చేస్తానని ఆ సమయంలో ప్రకటించారు. కానీ, అది అమలు కాలేదు. ఇక, ఇప్పుడు అనంత జిల్లాలో చేనేత కార్మికులు..రైతులతో సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు స్పందన ఏ రకంగా ఉంటుందనే దాని పైన ఇప్పుడు వైసీపీతో సమా టీడీపీ..బీజేపీలోనూ ఆసక్తి కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+