వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే రోడ్లపైకి వస్తా .. జనసేన కార్యకర్తలపై దాడులను సహించం : పవన్ కళ్యాణ్ అల్టిమేటం !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా తయారైన రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ ఆందోళన తెలియజేసిన విషయం తెలిసిందే. గుంతలు పడిన, ప్రయాణించడానికి వీలు కాని దుస్థితిలో ఉన్న రోడ్లను వీడియోలు, ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనసేన పార్టీ వినూత్న నిరసనలకు దిగింది. రోడ్లను మరమ్మతులు చేయాలని జగన్ సర్కార్ మీద ఒత్తిడి తెస్తోంది. ఒకవేళ సర్కార్ రోడ్ల మరమ్మత్తు చేయకుంటే గాంధీ జయంతి రోజున తామే శ్రమదానం చేసి రోడ్లు బాగు చేయడానికి రంగంలోకి దిగుతామని జనసేన హెచ్చరించింది.

ఏపీలో వినాయక చవితిపై రాజకీయ రచ్చ: అక్కడ 3 రోజులకు కుదించిన బీజేపీ సర్కార్: ప్రసాదాలకు నోఏపీలో వినాయక చవితిపై రాజకీయ రచ్చ: అక్కడ 3 రోజులకు కుదించిన బీజేపీ సర్కార్: ప్రసాదాలకు నో

 కార్యకర్తలపై దాడులపై స్పందించిన జనసేనాని

కార్యకర్తలపై దాడులపై స్పందించిన జనసేనాని

ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వాన స్థితిలో ఉన్న రహదారులపై జనసేన చేస్తున్న పోరాటంలో భాగంగా రోడ్ల పరిస్థితిని ప్రజాక్షేత్రంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తే సమస్య పెద్దదవుతుంది తప్ప పరిష్కారం కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

తానే స్వయంగా రోడ్లపైకి వస్తానన్న పవన్ కళ్యాణ్

తానే స్వయంగా రోడ్లపైకి వస్తానన్న పవన్ కళ్యాణ్

జనసేన కార్యకర్తలపై దాడి జరిగితే నేనే స్వయంగా రోడ్లపైకి వస్తానని, ఆ పరిస్థితి తీసుకు రావద్దని జనసేనాని హెచ్చరించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఇక ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం బాధాకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వం రిపేర్లు చేయించాల్సింది పోయి ఇదేంటి అని అడిగిన వారిపై దాడులు చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలసలో రోడ్ల దుస్థితి ఫ్లెక్సీ రూపంలో తెలియజేసినందుకు జనసేన నాయకుడలతో పాటుగా పార్టీ కార్యకర్తలపై పోలీసుల సమక్షంలోనే వైసిపి నాయకులు దాడులకు తెగబడ్డారు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయి అన్నారు.

పోలీసులు అలా చేస్తే వృత్తికి ద్రోహం చేసినట్టే

పోలీసులు అలా చేస్తే వృత్తికి ద్రోహం చేసినట్టే

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే వృత్తికి ద్రోహం చేసిన వాళ్లవుతారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు . 25 మందికి పైగా అధికార పార్టీ నాయకులు, తమ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, దాడులు చేస్తే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అవేమి పట్టనట్లు ప్రవర్తిస్తున్నారని, అంతేకాకుండా దాడి చేసిన వారిని వదిలి పెట్టి, జనసేన పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసిపి నాయకులు దాడి చేసిన ఘటనలో జనసేన కార్యకర్తలు ఎనిమిది మందికి గాయాలయ్యాయి అని, కనీసం వారిని ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళడానికి పోలీసులు విముఖత చూపారని పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రోడ్ల దుస్థితి తెలియజేస్తే దాడులా ?

రోడ్ల దుస్థితి తెలియజేస్తే దాడులా ?

మరోవైపు భీమవరంలో రోడ్ల దుస్థితిపై ఫ్లెక్సీ ద్వారా సమస్యలు తెలియజేయడానికి ప్రయత్నించిన జనసేన నాయకులపై కేసులు పెట్టారని, జనసేన నాయకుడు చినబాబుపై దాడికి ప్రయత్నం చేసిన అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కరరావు పై కేసులు నమోదు చేయకుండా, కేవలం జనసేన నాయకులపై కేసులు పెట్టడం కక్షసాధింపు చర్యల్లో భాగమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. నందిగామ మున్సిపాలిటీ అనాసాగరం లో కూడా జనసేన కార్యకర్తలపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వం జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టడం దాడులు చేయడం మానుకుని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. లేదంటే తానే రోడ్డు మీదకు వస్తానని, అంతవరకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.

Recommended Video

Ys Jagan సర్కార్ కు AP Roads తలనొప్పి.. గ్రౌండ్ రియాలిటీ!! || Oneindia Telugu
సోషల్ మీడియాలో జనసేన .. రోడ్ల దుస్థితిపై ఉద్యమం ఉధృతం

సోషల్ మీడియాలో జనసేన .. రోడ్ల దుస్థితిపై ఉద్యమం ఉధృతం

రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్ల దుస్థితిపై వీడియోలు తీసి వాటిని ప్రదర్శించి ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్న జనసేన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఆంధ్రప్రదేశ్ రోడ్ల కోసం జనసేన పార్టీ అనే నినాదంతో 1,26,000 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను బాగు చెయ్యటానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. సెప్టెంబర్ 2,3,4 తేదీలలో రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు షేర్ చేశారు. జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అన్న పేరుతో హాష్ ట్యాగ్ పెట్టి పోస్ట్ చేస్తున్నారు.

English summary
Attacks on Janasena party workers continue as part of Janasena's struggle on dilapidated roads in the state of Andhra Pradesh. Responding to the order, Janasena chief Pawan Kalyan set fire to Jagan govt. Pawan Kalyan said attacking party leaders and activists who are fighting public issues would not solve the problem unless it gets bigger. He warned Janasena that if he attacked the Janasena activists, he himself would come on the roads and not bring that situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X