పవన్ కల్యాణ్ నియోజకవర్గం ఖరారు

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖాయమవుతున్న తరుణంలో మరోసారి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నారనే విషయం వార్తల్లోకెక్కింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి రెండుచోట్లా ఓటమిపాలవడం పవన్ అభిమానులను, జనసేన శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈసారి రెండు నియోజకవర్గాలు కాకుండా కచ్చితంగా గెలుపొందే ఒకే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.

బలమున్న నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించండి..

బలమున్న నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించండి..

ఇటీవలే ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే విజయావకాశాలుంటాయంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ సర్వే నిర్వహించాయి. వాటిల్లో తిరుపతి, పిఠాపురం, కాకినాడ రూరల్ తోపాటు పలు నియోజకవర్గాలున్నాయి. టీడీపీతో పొత్తు నేపథ్యంలో జనసేనాని రాష్ట్రవ్యాప్తంగా కాకుండా తమకు బలమున్నచోటే సీట్లు అడగాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర ఉన్నాయి. పిఠాపురం నుంచి పోటీచేయడానికి అక్కడి జనసేన నేతలు పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తున్నారు. ఓటర్ల సంఖ్యలో దాదాపు 75 శాతం ఓటర్లు కాపు సామాజికవర్గానికి చెందినవారే ఉండటం విశేషం. ఇక్కడి నుంచి పోటీచేస్తే విజయం ఖాయమని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

కాకినాడ రూరల్ లో లక్షకు పైగా కాపు ఓటర్లు

కాకినాడ రూరల్ లో లక్షకు పైగా కాపు ఓటర్లు

అయితే పిఠాపురంపై పూర్తి స్పష్టత రాకుండా కాకినాడ రూరల్ నుంచి పోటీచేయబోతున్నట్లు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం నుంచి పోటీచేయడంవల్ల ఆ ప్రభావం చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాలపై పడుతుందని, వాటిల్లో కూడా గెలుపు సునాయాసమవుతుందని భావిస్తున్నారు. కాకినాడ రూరల్ కూడా కాపు సామాజికవర్గానికి పెట్టని కోట లాంటిది. ప్రస్తుతం మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పంతం నానాజీకి 40 వేల ఓట్లు వచ్చాయి. 2009లో కన్నబాబు ప్రజారాజ్యం తరఫున విజయం సాధించారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.

పార్టీలకతీతంగా పవన్ కు కాపుల ఓట్లు?

పార్టీలకతీతంగా పవన్ కు కాపుల ఓట్లు?


పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తే కాపుల బలం, టీడీపీ బలం కలగలిపి పవన్ కల్యాణ్ విజయం సాధించడానికి 100 శాతం అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 1.80 లక్షల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉండగా, కేవలం కాపులే లక్ష వరకు ఉంటారు. పార్టీలకతీతంగా కాపులంతా పవన్ ను గెలిపించుకుంటారని, కన్నబాబు లాంటి నాయకుడు గెలవగా, పవన్ లాంటి అధినేత విజయం సాధించడం సులువని భావిస్తున్నారు. పవన్ ఇక్కడి నుంచి పోటీచేస్తే చిరంజీవికి, జగన్ కు విధేయుడిగా ఉన్న కన్నబాబు పోటీచేస్తారా? వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా? అనేది వేచిచూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+