చంద్రబాబుతో పవన్ మీటింగ్, కారణమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ సోమవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశంకానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు పవన్‌కళ్యాణ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవలకాలంలో సమావేశమైన సందర్భాలు అరుదుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పవన్‌కళ్యాణ్ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

ప్రభుత్వతీరుకు వ్యతిరేకంగా పవన్ సభలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వతీరును ఆయన ఎండగడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను బాబుకు వివరించేందుకు పవన్ సోమవారంనాడు చంద్రబాబుతో సమావేశం కానున్నారు. కిడ్నీ బాధితులతో గతంలో పవన్ సమావేశమయ్యారు.

బాబుతో పవన్‌కళ్యాణ్ సమావేశం

బాబుతో పవన్‌కళ్యాణ్ సమావేశం

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు వివరించేందుకుగాను జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ సమావేశంకానున్నారు. కిడ్నీ బాధితులకు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేదిశగా చర్యలు చేపట్టాలని జనసేన చీఫ్ భావిస్తున్నారు. ఈ మేరకు ఈ భేటీలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున వాటర్‌ప్లాంట్లు, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు విషయమై పవన్ చర్చించే అవకాశాలున్నాయి.

రాజకీయాంశాలు చర్చకు వస్తాయా?

రాజకీయాంశాలు చర్చకు వస్తాయా?

గత ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.అయితే కొంతకాలంగా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలపై పవన్ ఒంటికాలిపై లేస్తున్నారు.ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి ఏపీని మోసం చేసిందని ఆయన విమర్శలు చేశారు. అంతేకాదు టిడిపి ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబుతో సమావేశంలో పవన్ రాజకీయాలను చర్చించే అవకాశం ఉందా అనే చర్చ సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఒకవేళ గతంలో తాను టిడిపి, బిజెపి ప్రభుత్వాలు వెలిబుచ్చిన అభిప్రాయాలపై చర్చిస్తారా లేదా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యలకే పరిమితమౌతారా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో ఎన్నికల వేడి

ఏపీలో ఎన్నికల వేడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి అప్పుడే ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా రేండేళ్ళ సమయం ఉంది. అయితే వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఇచ్చిన హమీలు ఎన్నికల వేడిని రగిల్చింది. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ఆయన పాదయాత్రను ప్రారంభించనున్నారు. మరోవైపు పవన్‌కళ్యాణ్ కూడ యాత్ర చేస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు సెప్టెంబర్ నుండి ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను టిడిపి నేతలు నిర్వహించనున్నారు.

మహాకూటమితోనే పవన్?

మహాకూటమితోనే పవన్?

వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్ వ్యవహరిస్తున్నారు. అయితే మహకూటమితోనే పవన్ పయనం సాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఆయన బిజెపి, టిడిపికి దూరంగానే ఉంటున్నారు. అయితే వైసీపీకి మహకూటమిలో ఉండే అవకాశం లేదని సిపిఐ రాష్ట్రసమితి కార్యదర్శి ఇదివరకే ప్రకటించారు. అయితే జనసేనతో వైసీపీ కలిసి పనిచేయాలని సూచనలు వచ్చినట్టు ప్రచారం కూడ సాగింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena chief Pawan kalyan will be meeting with Ap chiefminister Chandrababu naidu on Monday.he will explain problems of Uddanam kidney issues to Ap chiefminister.
Please Wait while comments are loading...