2016పై బాధపడ్డ పవన్ కళ్యాణ్! 'మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ'
2016వ సంవత్సరంలో నోట్ల రద్దు అంశం సామాన్యులను కాటేసిందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అందని మావిగా మిగిలిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
అమరావతి: 2016వ సంవత్సరంలో నోట్ల రద్దు అంశం సామాన్యులను కాటేసిందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అందని మావిగా మిగిలిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

2016 వెళ్లిపోయి కొత్త ఏడాది 2017 వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలను 2017 సంపూర్ణంగా నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రాలు ప్రగతి పథంలో పయనించాలని కోరుకుంటున్నానని తెలిపారు. దేశ ప్రజలందరికీ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కొత్త సంవత్సర వేడుకలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.












Click it and Unblock the Notifications