మస్ట్ వాచ్ మూవీ.. బ్రో

అమరావతి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ.. బ్రో. సముద్రఖని దర్శకుడు. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్ ఇది. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెరకెక్కించిన ఈ సినిమా ఇవ్వాళ విడుదలయింది. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ కోసమే ఈ సినిమా తీశారనే టాక్ ఉంది. సినిమా మొత్తాన్నీ ఆయన మోశారు. ఆయన అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిదే. పవన్ కళ్యాణ్ సరికొత్తగా కనిపించారిందులో. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో మాయ చేశారు. తనదైన శైలిలో డైలాగ్స్ పలికించారు. మొత్తానికి పవన్- త్రివిక్రమ్ కాంబో ఫర్వాలేదనిపించుకుంది.

raghuramakrishnamrajucommentsonbromovie1

బ్రో మూవీ- మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. తొలి రోజు మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజే సుమారు 30 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసినట్లు రిపోర్టులు అందుతున్నాయి. సాయిధరమ్ తేజ్ కేరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లను రికార్డు చేసిందనేది ఫిల్మ్ నగర్ టాక్.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు తొలి రోజే ఈ సినిమాను చూశారు. తన రివ్యూ ఇచ్చారు. దీన్ని మస్ట్ వాచ్ మూవీగా అభివర్ణించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా.. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని సూచించారు.

ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతం కాదనే సూత్రాన్ని ఈ సినిమా బోధించిందని రఘురామ ప్రశంసించారు. మావన జీవితాన్ని ఆవిష్కరించిందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, స్క్రీన్‌ప్లే-మాటలు సమకూర్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు రఘురామ కంగ్రాట్స్ చెప్పారు.

ఈ సినిమా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తన మిత్రుడని రఘురామ చెప్పారు. ఓ మంచి సినిమాను అందించారంటూ ఆయనను అభినందించారు. దర్శకుడు సముద్రఖని, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని పేర్కొన్నారు. ఓ మంచి చిత్రాన్ని చూశానంటూ వ్యాఖ్యానించారాయన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+