వైసీపీకి మద్దతుగా జబరస్థ్ నటుడు..ఇండస్ట్రీలో లేకుండా చేస్తామంటూ జనసేన బెదిరింపు
ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతలందరూ కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పలువురు సినీ సెలబ్రిటీలు సైతం తమకు నచ్చిన పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మెగా హీరోలతో పాటు, జబర్థస్త్ బ్యాచ్, సీరియల్స్ బ్యాచ్ మొత్తం కూడా రంగంలోకి జనసేన తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. యాంకర్ శ్యామల ఒక్కరే వైసీపీకి మద్దతు నిలుస్తున్నారు.
వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా యాంకర్ శ్యామల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆమెపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఘెరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. జగన్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తుందనే కారణంతో ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా మరో నటుడు చేరాడు. వైసీపీకి సపోర్టు చేయడంతో అతనికి అవకాశాలు లేకుండా చేస్తామని బెదరించడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ మంత్రి రోజాకు మద్దతుగా ఓ వీడియోను షేర్ చేశారు.

అయితే రాకింగ్ రాకేష్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రాకేష్‌ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడంతో పాటు నీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ కు భయపడిన రాకేష్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయడం జరిగింది. పవన్ ఫ్యాన్స్ తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీకి మద్దతుగా నిలిస్తే వారిని ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే పవన్‌కు పడే ఓట్లు కూడా తగ్గిపోతాయని వారు అభిమానులను హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications