బయటకొచ్చిన పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఫొటో..హెల్త్ పరిస్థితి ఎలా ఉందంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే, ఆయన తన పర్యటనను ముగించుకుని సింగపూర్ చేరుకున్నారు. పవన్ కల్యాణ్ నేరుగా ఆస్పత్రికి చేరుకుని, తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను ఆరా తీశారు. మార్క్ శంకర్‌ని చూశానని త్వరగానే కోలుకుంటున్నాడని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఎమెర్జెన్సీ వార్డు నుంచి మార్క్ శంకర్‌ని జెనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. గాయాల తీవ్రత తగ్గే వరకు అంటే మూడు రోజుల నుంచి ఐదు రోజుల పాటు మార్క్ శంకర్ ఆస్పత్రిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న శంకర్ తాను బాగానే ఉన్నానని సిగ్నల్ ఇచ్చాడు. అయితే చేతికి బాగా గాయాలు అయినట్టు ఈ ఫొటోను చూస్తే అర్థం అవుతోంది. మార్క్ శంకర్‌ ప్రమాదం నుంచి బయటపడటంతో మెగా కుటుంబంతో పాటు, జనసేన శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.అయితే మార్క్ శంకర్ ను చూసేందుకు పవన్ అన్న చిరంజీవి, వదిన సురేఖ తో కలసి సింగపుర్ చేరుకున్నాడు.

Pawan Kalyan s second son Mark Shankar photo goes viral

మరోవైపు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు జరిగిన ప్రమాదంపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరగడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. మంత్రి నారా లోకేష్ సైతం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ వెంటనే కోలుకోవాలని వారు ప్రార్థించారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ సైతం స్పందించారు. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఆయన త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ జగన్ ట్విట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+