ఇంటర్ విద్య రద్దు, ఇక నుంచి కొత్తగా - సంచలన నిర్ణయం..!!
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్ విద్య ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. ఇక నుంచి ఇంటర్ స్థానంలో కొత్త విద్యావిధానం అమల్లోకి రానుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 12వ తరగతి విద్యావిధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్ విద్య ఇక రద్దు కానుంది.
ఇంటర్ విద్య పైన సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యను ప్రభుత్వం రద్దుచేసింది. పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2027-28 విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యావిధానం అమల్లోకి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. పదో తరగతి తర్వాత సగటున 40 శాతం చదువు మానేస్తున్నారని.. దీంట్లో అత్యధికులు బాలికలు, దళిత, మైనారిటీ వర్గాల పిల్లలే ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, కేజీబీవీల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయని తెలిపారు. దేశంలో 18 రాష్ట్రాల్లో 12వ తరగతి విద్యావిధానమే అమలవుతుందని చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ విద్యామంత్రి గా ఉన్నప్పుడు 1969-70లో మొదలైన ఇంటర్ విధానం దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ముగియనుంది.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో
కాగా, కొత్త విధానంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8 వరకు సెకండరీ, 9 నుంచి 12 వరకు సీనియర్ సెకండరీ విద్యగా పునర్ వ్యవస్థీకరించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్పొరేట్ కాలేజీలకు నష్టం జరుగుతుంది. దీనిపై నా మీద తీవ్ర ఒత్తిడి ఉంది. అయినా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎక్కడా తలొగ్గకుండా ముందుకు వెళ్తున్నా' అని సీఎం ఉన్నతాధికారులతో అన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వమే కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రకటించామన్నారు. తన నిర్ణయాల్లో లోటుపాట్లు ఉంటే నేరుగా తనకే చెప్పాలని, మరింత మెరుగ్గా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అదే సమయంలో జూనియర్ కాలేజీల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రేవంత్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
