ఐపీఎల్ కు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్లు: సగం టీమ్ దిగుతోంది

ఐపీఎల్ మినీ వేలం గడువు దగ్గర పడుతోంది. డిసెంబర్ 16వ తేదీన గోవా వేదికగా ఈ ఆక్షన్ జరుగనుంది. ఇప్పటికే రిటెన్షన్ కోలాహలం సాగుతోంది ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో ఈ నెల 17వ తేదీ నాటికి రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్ల పూర్తి జాబితాను అందజేయాల్సి ఉంది. ఇది ముగిసిన తర్వాత ఆక్షన్ ఉంటుంది. ఈ సారి కూడా 800 మంది వరకు ప్లేయర్లు ఈ రేసులో నిల్చొనే అవకాశం ఉంది. వారిలో ఎంతమందికి మ్యాచ్ లు ఆడే అదృష్టం దక్కుతుందనేది ఉత్కంఠత రేపుతోంది.

ఈ ఐపీఎల్ ఆక్షన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ స్టార్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా ఆక్షన్ కు రాబోతోన్నాడు. రాబోయే సీజన్ కోసం నిర్వహించే ఈ వేలంలో పాల్గొనడానికి తన పేరును సైతం రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా వెల్లడించింది కూడా. గతంలో చోటుచేసుకున్న వివాదాలు, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆయనను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Bangladesh Fast bowler Mustafizur Rahman is set to register for the IPL mini auction BCB Confirms

ఇప్పుడు మళ్లీ లీగ్‌లోకి అడుగుపెట్టడానికి ముస్తాఫిజుర్ సిద్ధం అయ్యాడు. ముస్తాఫిజుర్ తో పాటు మరో ఆరుమంది ప్లేయర్లు కూడా ఈ వేలం కోసం దరఖాస్తు చేసుకున్నారని బీసీబీ ప్రతినిధి షహరియార్ నఫీస్ తెలిపారు. నౌహిద్ రాణా, రిషాద్ హొస్సేన్, హసన్ మహమూద్, తౌహీద్ హృదోయ్, తస్కీన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం ఈ జాబితాలో ఉన్నారు.

తిరుమల అన్నప్రసాద కేంద్రం, లగేజీ కౌంటర్ల వద్ద ఇకపై కొత్తగా.. !!
తిరుమల అన్నప్రసాద కేంద్రం, లగేజీ కౌంటర్ల వద్ద ఇకపై కొత్తగా.. !!

గత ఐపీఎల్ సీజన్ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధరకు దక్కించుకుంది. సుమారు రూ. 9.20 కోట్లు వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా అప్పట్లో రికార్డు సృష్టించాడు ముస్తాఫిజుర్. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, అక్కడి రాజకీయ పరిణామాల వల్ల భారత అభిమానుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ అతన్ని జట్టు నుంచి తొలగించాల్సి వచ్చింది.

కార్తీకమాసంలో దీపారాధనకు ఏ నూనె ఎంత శ్రేష్ఠం
కార్తీకమాసంలో దీపారాధనకు ఏ నూనె ఎంత శ్రేష్ఠం

దీని ప్రభావం రెండు దేశాల క్రీడా సంబంధాలపై తీవ్రంగా పడింది. భద్రతా కారణాలను చూపుతూ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో మ్యాచ్‌లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. తమ మ్యాచ్‌లను వేదిక మార్చి శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరింది గానీ అది సాధ్యపడలేదు. ఈ పరిణామంతో బంగ్లాదేశ్ బాయ్ కాట్ చేసింది. ఫలితంగా ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకుంది.

ఇప్పుడా పరిస్థితులు లేవు. రాబోయే మినీ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎలాంటి వైఖరి అవలంభిస్తాయనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. డెత్ ఓవర్లలో ఎలాంటి బ్యాటర్ ను అయినా కట్టడి చేయగల ముస్తాఫిజుర్ వంటి అనుభవజ్ఞుడైన పేసర్ అందుబాటులో ఉండటం బౌలింగ్ విభాగాన్ని బలపరుచుకోవాలనుకునే జట్లకు ఉపకరించే అంశమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+