రాజ్‌భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి
హైదరాబాద్: రాజ్ భవన్ ఎదుట రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన పవన్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివార సదరు వ్యక్తి శ్వాస విడిచాడు.

కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజ్ భవన్ ఎదుట ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తనపై వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అతను డిమాండ్ చేశాడు.
తనను స్థానిక సిఐ వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయాన్ని గవర్నర్‌కు చెబుతానని ఆయన రాజ్ భవన్‌కు చేరుకున్నాడు. తనను లోనికి అనుమతించాలని భద్రతా సిబ్బందిని కోరాడు.

వారు నిరాకరించడంతో అతను తన వెంట తెచ్చుకున్న పరుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న పోలీసులు అతనిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్. ఆదివారం మృతి చెందాడు.












Click it and Unblock the Notifications