విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన పవన్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ డిజిటల్ క్యాంపెయిన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి తీసుకురావడానికి జనసేన చేపట్టిన కార్యక్రమం ఈరోజు నుండి మూడు రోజుల పాటు కొనసాగుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణకై ట్విటర్ ద్వారా క్యాంపెయిన్ ను ప్రారంభించారు.

 విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం డిజిటల్ క్యాంపెయిన్

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం డిజిటల్ క్యాంపెయిన్

మూడు రోజుల పాటు సాగనున్న ఈ డిజిటల్ క్యాంపెయిన్లో ఆంధ్ర ఎంపీలను, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూ వారిని ట్యాగ్ చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలలో ప్ల కార్డులతో నిరసన తెలియజేయాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో ప్రారంభమైంది. జనసేన పార్టీ నేతలు విస్తృతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేస్తూ డిజిటల్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ గళాన్ని వినిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న జనసేన

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం ఏపీ ఎంపీలు గట్టిగా పోరాటం చేయడం లేదంటూ, కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకు రావడం లేదంటూ, జగన్ సర్కార్ పై ఇప్పటికే విరుచుకుపడిన పవన్ కళ్యాణ్ ఎంపీలపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాల్సి ఉంది. విశాఖ ఉక్కు పరిరక్షణకోసం సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ఎంతో మంది త్యాగాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కొత్త ప్లాన్

ఇక ఈ క్యాంపెయిన్ కి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలకు, ఎమ్మెల్యేలకు తమ బాధ్యతను గుర్తు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీని పదేపదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తునారు. ప్రతి ఒక్కరు ఈ క్యాంపెయిన్లో ఎంపీలను టార్గెట్ చేస్తూ ట్యాగ్ చెయ్యాలని సూచించారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేయాలని, ఈ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. ఎంతో మంది త్యాగాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వైసీపీపై ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

అప్పు ఉంటే అమ్మేస్తామన్న వాదనతో ఆంధ్రప్రదేశ్ ను కూడా ప్రైవేటీకరణ చేస్తారా?

అప్పు ఉంటే అమ్మేస్తామన్న వాదనతో ఆంధ్రప్రదేశ్ ను కూడా ప్రైవేటీకరణ చేస్తారా?

ఇక ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ చేపట్టిన డిజిటల్ ఉద్యమం ప్రారంభించి అప్పు ఉంటే అమ్మేస్తామన్న వాదనతో ఆంధ్రప్రదేశ్ ను కూడా ప్రైవేటీకరణ చేస్తారా అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు .ఆంధ్ర ఎంపీల విషయంలో raise placards అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా క్యాంపెయిన్ ప్రారంభించారు. మరి ఈ క్యాంపెయిన్ లో ఆంధ్ర ఎంపీలపై ఒత్తిడి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+