పవన్‌కు ముదిరింది: పద్మ, నడిరోడ్డుపై: రామోజీపై గట్టు

Pawan lost his mental balance: Vasireddy
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం నిప్పులు చెరిగారు. పవన్‌కు పిచ్చి ముదిరిందని, ఇకనైనా పవన్ తప్పుడు మాటలను మానుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని, సీమాంధ్రలో కాపులకు డిప్యూటీ సిఎం పదవి ఇస్తానంటూ చంద్రబాబు ఆశపెడుతున్నారన్నారు. బిసిలకు ఎన్ని సీట్లు కేటాయించారని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. నగదు, మద్యం విచ్చలవిడిగా పంచుతూ అధికారంలోకి రావాలని బాబు ప్రయత్నిస్తున్నారన్నారు. పవన్ పిచ్చి ముదిరిన పిల్లవాడన్నారు.

గట్టు ఆగ్రహం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజలే సైన్యమని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు వేరుగా అన్నారు. రామోజీ రావు, చంద్రబాబు ఇప్పుడు మూటాముల్లె సర్దుకుంటున్నారని, వాళ్లు ఏ దేశం వెళ్లినా తిరిగి ఇద్దరినీ తీసుకొచ్చి, నడిరోడ్డుపై విచారణ చేయిస్తామన్నారు.

చిత్తూరు జిల్లా అలిపిరిలో జరిగిన దాడి సంఘటన తర్వాత ముఖ్యమంత్రి పదవి పొందడం కోసం ఎవరు పాకులాడారో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. కేవలం అధికారం పొందడం కోసం నానా పార్టీలతో కూటమి కట్టి, అందరి మద్దతున్నా ఓడిపోయిన ఘనత కూడా ఆయనదేనని ఎద్దేవా చేశారు.

జగన్‌కు ధైర్యం లేదా: పవన్

కెసిఆర్‌ను తిట్టే ధైర్యం జగన్‌కు లేదా? అని పవన్ కళ్యాణ్ అనంతపురంలో ప్రశ్నించారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాయలసీమ పచ్చగా కళకళలాడాలనేదే తన కోరిక అన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ప్రజల సొత్తు అని, దాన్ని దోచుకోవాలని చూసే నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. జైలుకెళ్లి వచ్చిన అతను ప్రజలకేం చేస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+