ఈసారి పవన్‌కళ్యాణ్ అన్నయ్య చిరుని పక్కన పెట్టారా!?

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలోని పలువురికి ప్రతి ఏటా తన ఫాం హౌస్‌‍లో పండిన మామిడి పళ్లు పంపిస్తుంటారట. అందులో భాగంగా ఈ ఏడాది కూడా ప్రముఖ నటుడు నితిన్ తదితరులకు పంపించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరెవరికి పంపించారనే విషయమై చర్చనీయాంశమైంది. అయితే ఈ లిస్టులో పవన్ అన్నయ్య, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత చిరంజీవి లేరట!

ప్రతి ఏటా పవన్ కళ్యాణ్ తన ఫాంహౌస్‌లో పండిన మామిడి పళ్లను చిత్ర పరిశ్రమలోని పదిహేను మంది వరకు పంపిస్తారట. నటులు, టెక్నీషియన్స్ అనే తేడా లేకుండా అందరికీ పంపిస్తారట. అయితే, ఆ ఏడాది తనకు దగ్గరగా ఉన్న వారికి పవన్ పంపిస్తుంటారట.

Pawan sends boxes of mangoes from his own garden

తన అన్నయ్యలు చిరంజీవి, నాగబాబులకు మాత్రం ప్రతి ఏటా పంపిస్తుంటారట. ప్రతి ఏటా మామిడి పళ్లు పంపించే వారి లిస్టులో మెగా సోదరులు తప్పకుండా ఉంటారట. కానీ, ఈసారి వారికి పంపించలేదట!

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీలో ఉన్న చిరంజీవి ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. జనసేన పార్టీని స్థాపించిన పవన్ మాత్రం బిజెపి - టిడిపికి కూటమికి ప్రచారం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో పవన్ ప్రచారం చేసిన పార్టీలో అధికారంలోకి వచ్చాయి.

సాధారణంగానే పవన్ తన గార్డెన్ పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తారట. పంట చేతికొచ్చే సమయంలో మరింత ఎక్కువ దృష్టి పెడతారట. విశ్రాంతి దొరికితే పవన్ గార్డెన్‌లో గడుపుతారట. కాగా, ఈసారి తన సోదరులకు మామిడి పళ్లు పంపించని పవన్ నిర్మాత సురేష్ బాబుకు మాత్రం పంపించారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+