ప్రచారంలో టీటీడీని కూడా వాడేస్తున్న నేతలు ! వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుప‌తి స‌భ‌లో పాల్గొన్నారు. స్థానిక వైసిపి అభ్య‌ర్ది క‌రుణాక‌ర రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ఇక‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో స‌హా..వైసిపి అధినేత జ‌గ‌న్ పైనా ఆరోప‌ణ‌లు గుప్పించారు. టిడిపి అధికారంలోకి వ‌స్తే లంచాలు..క‌బ్జాలు పెరిగిపోతాయ‌ని హెచ్చ‌రించారు.

క‌రుణాక‌ర రెడ్డి న‌గ‌లు మాయం చేసారు...

క‌రుణాక‌ర రెడ్డి న‌గ‌లు మాయం చేసారు...

టిటిడి చైర్మ‌న్ గా భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి ఉన్న స‌మ‌యంలో ఎన్ని న‌గ‌లు పోయాయో లెక్క లేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. వెంక‌టేశ్వ‌రుడినే న‌మ్మ‌ని క‌రుణాక‌ర రెడ్డి వ‌స్తే తిరుప‌తికి ఏమీ జ‌ర‌గ‌ద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. క‌రుణాక‌ర రెడ్డి మ‌నుషుల‌కు విలువ ఇవ్వ‌ర‌ని..ఇప్ప‌టికీ సీమ జిల్లాల్లోని సామాన్యులు వీరి ఇళ్ల మ‌ధ్య న‌డిచి వెళ్లాలంటే చెప్పులు చేతిలో పెట్టుకొని వెళ్లాల‌ని వ్యాఖ్యానించారు. ద‌ళితుల‌ను వాడుకొని వ‌దిలేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు..జ‌గ‌న్ లకు అధికార‌మే కావాల‌ని అన్నారు. వైసిపి లాంటి పార్టీకి బుద్ది చెబితేనే ద‌ళితుల కు న్యాయం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ద‌ళితులు ఎన్నాళ్లు వీరి ప‌ల్ల‌కీలు మోయాల‌ని ప్ర‌శ్నించారు.

 జ‌గ‌న్ చెప్పుల‌తో తిరుమ‌ల‌కు వెళ్తారు..

జ‌గ‌న్ చెప్పుల‌తో తిరుమ‌ల‌కు వెళ్తారు..

వైసిపి అధినేత జ‌గ‌న్ తిరుమ‌ల‌కు చెప్పులేసుకొని వెళ్తార‌ని ఆరోపించారు. అక్క‌డ ప్రోటోకాల్ పాటించ‌ర‌న్నారు. తాను మ‌హానుబావుడ‌ని జ‌గ‌న్ అనుకుంటార‌ని ఎద్దేవా చేసారు. వైసిపిని స‌మూలంగా ఓడించాల‌ని పిలుపు నిచ్చారు. ద‌ళితు లు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని పిలుపునిచ్చారు. రౌడీయిజాన్ని ఎదుర్కోవాలంటే బీఎస్పీ అధినేత్రి మాయావతిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపిని వ్య‌తిరేకించే కేసీఆర్ తో జ‌గ‌న్ కు పొత్తు ఎలా పెట్టుకుంటా ర‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ వేసే బిస్కెట్ల‌కు క‌క్కుర్తి ప‌డి జ‌గ‌న్ వారితో న‌డుస్తున్నార‌ని విమ‌ర్శించారు. మాయావ‌తి ఏపి కి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని..చంద్ర‌బాబు లాగా అనేక నాలుక‌లు మాయావ‌తికి లేవ‌ని పేర్కొన్నారు. ఏపికి ప్ర‌త్యేక హోదా కోసి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన మాయావ‌తికి అంద‌రూ రుణ‌ప‌డి ఉండాల‌న్నారు.

నాతోనే హోదా స‌జీవంగా ఉంది..

నాతోనే హోదా స‌జీవంగా ఉంది..

త‌న కార‌ణంగానే ఏపికి ప్ర‌త్యేక హోదా అంశం ఇంకా స‌జీవంగా ఉంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాన్ పేర్కొన్నారు. తాను హోదా పై డిమాండ్ చేసిన త‌రువాత‌నే కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజి ప్ర‌క‌టించింద‌ని గుర్తు చేసారు. పాచిన ల‌డ్డు కేంద్రం ఇస్తే.. టిడిపి నేత‌లు దానిని రుచిగా ఉందంటూ తీసుకున్నార‌ని ఆరోపించారు. హోదా విష‌యంలో చంద్ర‌బాబు ఎలా వ్య‌వ‌హ‌రిం చారో వివ‌రించారు. జ‌గ‌న్ కు ఏపి ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వ‌ని..ఇప్పుడు కేసీఆర్ ఏపికి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇస్తున్నా ర‌ని చెబుతున్నార‌ని..ఏపి కి హోదా కోసం కేసీఆర్ ఎలా మ‌ద్ద‌తు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. ఏపికి హోదా రావాల‌ని కేసీఆర్ కోరుకుంటే తెలంగాణ కు ప‌రిశ్ర‌మ‌లు ఎలా వ‌స్తాయయి..ఈ విష‌యం కేసీఆర్ కు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+