వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు- పేర్ని నాని : వకీల్ సాబ్ సమయంలో అలా: దిల్ రాజు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేుకుంటున్నాయి. ఒక వైపు పవన్ కళ్యాణ్ మంగళగిరి కేంద్రంగా పార్టీ సమావేశంలో వైసీపీ పైన విరుచుకుపడ్డారదు. సీఎం కు సవాల్ చేసారు. అదే సమయంలో నిర్మాతలు నేరుగా బందరు వెళ్లి మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యల పైన చిరంజీవి తనకు ఫోన్ చేసారని మంత్రి నాని వివరించారు. జరిగిన ఘటన పైన విచారం వ్యక్తం చేసారని చెప్పుకొచ్చారు.

పేర్ని నానికి చిరంజీవి ఫోన్

పేర్ని నానికి చిరంజీవి ఫోన్

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల దుమారంతో చిరంజీవి మంత్రి పేర్ని నానికి ఫోన్ చేసారు. జరిగిన పరిణామాల పైన విచారం వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని మంత్రి బయట పెట్టారు. ఈ రోజు నిర్మాతలు కలిసిన తరువాత మాట్లాడిన మంత్రి.. ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి కూడా చెప్పారన్నారు. ఇండస్ట్రీ బ్రతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు , సలహాలు పాటించేందుకు సిద్ధమని చెప్పారని మంత్రి వివరించారు. ఇక, పవన్ చెబుతున్న విధంగా తాను రెడ్లకు పాలేరునైతే..పవన్ కమ్మ వాళ్లకు పాలేరంటూ వ్యాఖ్యానించారు.

పవన్ కు పేర్ని నాని కౌంటర్

పవన్ కు పేర్ని నాని కౌంటర్

తాను జగన్ దగ్గర పాలేరునే... నీకు చెప్పే దమ్ముందా అంటూ పవన్ ను ప్రశ్నించారు. తనను అవమానించాలని చూస్తే ... ఆ అవమానాన్ని పరిచయం చేస్తానని హెచ్చరించారు. దేశంలో కిరాయికి రాకీయపార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ దుయ్య బట్టారు. రాజకీయపార్టీలకు టెంట్ హౌస్ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని వ్యాఖ్యానించారు. ఇక, నిర్మాత దిల్ రాజు సినిమా రంగం పరిశ్రమ పై కోవిడ్ ప్రభావం ... సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయని వివరించారు. దయచేసి అందరూ వివాదాలకు మమ్మలేని దూరంగా ఉంచండంటూ కోరారు.

Recommended Video

Tollywood Producers Meets AP minister Perni Nani
వివాదాల్లోకి లాగవద్దని దిల్ రాజు వేడుకోలు

వివాదాల్లోకి లాగవద్దని దిల్ రాజు వేడుకోలు

గతంలో మా విజ్ఞప్తి పై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఆన్ లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు. ఆన్ లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుందన్నారు. సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగవద్దన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే తమకు సంబంధం లేదని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం..సినీ పరిశ్రమ మధ్య సత్సంబంధాల కోసం సినీ పెద్దలు రంగంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది.

English summary
With the war of words over online ticketing system escalating, Tollywood producers team met Minister Perni Nani.Perni Nani said that Chiranjeevi had spoke to him and felt bad for what had happend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X