వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కు మద్దతుగా హీరో నాని : కళ్యాణ్ తో విభేదాలు పక్కన పెట్టండి- సినీ ఇండస్ట్రీని ఆదుకోండి : సీఎం కు వినతి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రముఖ సినీ హీరో...జనసేన అధినేత ఏపీ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదంగా మారాయి. పవన్ వ్యాఖ్యల మీద వరుసగా మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పు బడుతున్నారు. అసలు ఆన్ లైన్ టిక్కెట్ల ప్రతిపాదన వచ్చిందే సినీ ఇండస్ట్రీ నుంచి అంటూ పవన్ ను కార్నర్ చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కు మద్దతుగా యువ హీరో ముందుకు వచ్చారు. నేచురల్ స్టార్ నాని తన అభిప్రాయం చెబుతూ వరుస ట్వీట్లు చేసారు. పవన్ కళ్యాణ్ సార్..ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న రాజకీయ విభేదాలు పక్కన పెట్టండంటూ సూచించారు.

సినీ పరిశ్రమ సమస్య పరిష్కారాల కోసం తక్షణం మీ ఫోకస్ పెట్టాలని కోరుకుంటుంది అంటూ పవన్ కు సైతం ట్యాగ్ చేసారు. మరో ట్వీట్ లో ముఖ్యమంత్రి ..మంత్రులు సినిమా కోలుకోవటానికి మరింత ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని నాని అభ్యర్దించారు. పవన్ కళ్యాణ్ సినీ కష్టాలు చెబుతూనే..ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సమయంలో హీరో నాని గురించి ప్రస్తావించారు. తాజాగా కొందరు నానిని విమర్శించటం తనకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. తనేదో ఒక సినిమా చేసుకున్నాడు. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడితే దానికి తనేం చేస్తాడు.

Pawan vs Jagan:Hero Nani supports PK,requests AP govt to look into the industry issues

నిర్మాతల శేయస్సు కోరే ఓటీటీలో తను నటించిన 'టక్ జగదీష్' రిలీజ్ చేశారు. అందుకు నానిని అంటే ఎలా..ఇలా ఒక సినిమా ఓటీటీకి వెళ్ళిందంటే అందుకు కారణమైన వారిని కదా అనాలి. అంటూ నేచురల్ స్టార్ నానికి పూర్తి మద్దతు ఇస్తూ మాట్లాడారు పవన్ కళ్యాణ్. దీంతో..ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకు మద్దతుగా మాట్లాడటంతో..నాని సైతం స్పందిస్తూ పవన్ వాదననే ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా నివేదించారు. ఇక, పవన్ చేసిన వ్యాఖ్యలతో మంత్రులు బొత్సా సత్యనారాయణ..అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ వరుసగా రియాక్ట్ అయ్యారు.

Pawan vs Jagan:Hero Nani supports PK,requests AP govt to look into the industry issues

పవన్ పైన మండి పడ్డారు. మంత్రి పేర్ని నాని పైన సన్నాసి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు సీరియస్ గా తీసుకున్నారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వినతినే ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుందంటూ చెప్పుకొచ్చారు. ఇక, మంత్రి అనిల్ స్పందిస్తూ పవన్ నటన పైన కామెంట్స్ చేసారు. ఇక, తాజాగా నాని చేసిన వ్యాఖ్యల పైన ఏపీ ప్రభుత్వం.. పెద్దల నుంచి ఎటువంటి స్పందిన వస్తుందనేది వేచి చూడాలి. అయితే, సినీ ఇండస్డ్రీ...ఇటు పొలిటికల్ సర్కిల్స్ పవన్ వ్యాఖ్యలు..ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన పైన బయట పడకపోయినా జాగ్రత్తగా పరిణామాలను పరిశీలిస్తున్నారు. దీంతో..ఈ వ్యవహారం ఇంకా ఎటువంటి టిస్టులు తీసుకుంటుందో చూడాలి.

English summary
Amid the war between Pawan kalyan and AP govt, Hero Nani comes in support of the former and requests AP govt to look into the industry issues that are Genuine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X