పవన్ కల్యాణ్ ప్రచార రధం సిద్దం: వారాహి - రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక ప్రజల్లోకి రానున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. దసరా నుంచే పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర ప్రారంభించాలని భావించారు. ముందుగా తిరుపతి నుంచి ప్రారంభించాలా నిర్ణయం తీసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ సమయంలో పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వీలుగా ప్రత్యేకంగా ప్రచార రధం సిద్దం అయింది. కొంత కాలంగా ప్రత్యేక ఏర్పాట్లతో దీనికి తుది మెరుగులు దిద్దారు.

 Pawankalyan elections campaign vehicle named Vaarahi,Video trends on social media

సినిమా షూటింగ్ లో ఉన్న పవన వద్దకు ఈ వాహనాన్ని పార్టీ నేతలు తీసుకొని వెళ్లారు. ఆర్మీ వాహనం తరహాలో ఈ ప్రచార రధాన్ని తీర్చి దిద్దారు వాహనానికి పవన్ కళ్యాణ్ తన దైన శైలిలో వారాహి అనే పేరు ఖరారు చేసారు. ఈ వాహనం వీడియో విడుదల లోనూ మంచి హైప్ క్రియేట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్మీ వాహనానికి సైనికులు తరహాలో పవన్ కొత్త రధం వెంట జనసైనికులు ఉండనున్నారు. పవన్ ఈ వాహనం మొత్తం పరిశీలించి ఓకే చెప్పారు. తన ప్రచార వాహనానికి పవన్ కల్యాణ్ వారాహి అనే పేరు ఖరారు చేసారు. ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ పవన్ సాధ్యమైనంత సమయం ప్రజల మధ్యనే ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

పపవన్ కల్యాణ్ ప్రజల మధ్యలోకి వస్తే వచ్చే స్పందన..అభిమానులు దగ్గరకు వచ్చే ప్రయత్నాలు సాధారణం కావటంతో వాటిని పరిగణలోకి తీసుకొని ఈ వాహనం సిద్దం చేసారు. ఇందులోనే పవన్ బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి సమయాల్లో ప్రచారం వేళ..ఈ వాహనం లో ఏర్పాటు చేసిన లైట్ల నుంచే ప్రసంగాలు కొనసాగించే వీలు కల్పించారు. అదే విధంగా ప్రసంగాలు స్పష్టంగా వినబడేలా మైక్ సిస్టమ్ సిద్దం చేసారు. వాహనంలో పవన్ ముఖ్యులతో చర్చలకు వీలుగా ఒక చిన్న మీటింగ్ రూం ఉంది. అయితే, పవన్ ఎప్పటి నుంచి తన యాత్ర ప్రారంభిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.

 Pawankalyan elections campaign vehicle named Vaarahi,Video trends on social media
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+