వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్‌మెన్లను వెనక్కి పంపిన పవన్: పార్టీ రహస్యాలు లీక్, సర్కార్ నిఘా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రభుత్వ గన్‌మెన్లను పవన్ ఎందుకు వెనక్కి పంపాడు?

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన సెక్యూరిటీని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వెనక్కు పంపారు. తనకు నియమించిన సెక్యూరిటీని ప్రభుత్వం తనపై నిఘా కోసం ఉపయోగించుకొంటుందని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన గన్‌మెన్లకు వెనక్కు తిప్పి పంపారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనకు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లకు నెల రోజులకు ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. పార్టీ కార్యకలాపాలు లీక్ అవుతున్నాయనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.

నెలరోజుల్లోనే ప్రభుత్వం తనకు కేటాయించిన సెక్యూరిటీని వెనక్కు పంపడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ సెక్యూరిటీ కారణంగా లాభం కంటే నష్టమే అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్న తరుణంలో పవన్ ఈ నిర్ణయం తీసుకొన్నారని తెలుస్తోంది.

ప్రభుత్వ సెక్యూరిటీని తిప్పి పంపిన పవన్

ప్రభుత్వ సెక్యూరిటీని తిప్పి పంపిన పవన్

ఈ ఏడాది మార్చి 14వ తేదిన గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ డీజీపికి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కు 2+2 గన్‌మెన్లను కేటాయించింది. ప్రతి షిప్టులో ఇద్దరు గన్‌మెన్లు పవన్ కళ్యాణ్‌తోనే ఉంటారు. మిగిలిన ఇద్దరూ గన్‌మెన్లు రెస్ట్‌ తీసుకొంటారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే గన్‌మెన్లను పవన్ కళ్యాణ్ వెనక్కు పంపించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తనకు నియమించిన సెక్యూరిటీ వెనక్కు పంపారు.ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ కూడ పంపారని తెలుస్తోంది.

సెక్యూరిటీని నిఘా కోసం వాడుకొంటున్న సర్కార్

సెక్యూరిటీని నిఘా కోసం వాడుకొంటున్న సర్కార్

తనకు రక్షణగా ఉపయోగించిన సెక్యూరిటీని ప్రభుత్వం నిఘా కోసం ఉపయోగిస్తోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే సెక్యూరిటీని వెనక్కు పంపాలని నిర్ణయం తీసుకొని అమలు చేశారు. సెక్యూరిటీ వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ఈ సెక్యూరిటీని వెనక్కు పంపారు.

పార్టీ సీక్రెట్స్ లీకయ్యాయి

పార్టీ సీక్రెట్స్ లీకయ్యాయి

పార్టీ అంతర్గత విషయాలు లీకయ్యాయని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. జనసేన రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలతో పాటు ఇతర విషయాలపై పార్టీ చేసిన చర్చలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి చేరిపోయిందనే అభిప్రాయం జనసేనవర్గాల్లో నెలకొంది. నెల రోజుల కాలంలో పార్టీకి సంబందించిన కీలక చర్చలకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడైందని జనసేన చీఫ్ భావిస్తున్నారు. ఈ తరుణంలో సెక్యూరిటీ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే సెక్యూరిటీని వెనక్కు పంపించారు.

ప్రైవేట్ సెక్యూరిటీ

ప్రైవేట్ సెక్యూరిటీ

ప్రభుత్వ సెక్యూరిటీ ఉన్నా కానీ, పవన్ కళ్యాణ్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. సినిమా నటుడుగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు చాలా కాలంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. ప్రభుత్వ సెక్యూరిటీ వెనక్కు వెళ్ళడంతో ప్రైవెట్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ రక్షణ బాధ్యతను చూసుకొనే అవకాశం ఉంది.

English summary
Janasena chief Pawan Kalyan has withdrawn his government security. Ap government allotted to Pawan kalyan 2+2 security on March 14 , 2018. government used to spy through the security on janasena activities, suspected pawan kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X