జగన్ భయపెట్టి రాజకీయం చేయాలని..!!

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన రాజకీయ వివాదంగా మారింది. జగన్ పర్యటన పైన ఆంక్షలు.. కొందరు కార్యకర్తలు ప్రదర్శించిన వివాదాస్పద నినాదాల ఫ్లెక్సీలతో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది. ఫ్లెక్సీల పైన ఉన్న నినాదాలు సినిమా డైలాగ్ గా పేర్కొన్న జగన్.. పరోక్షంగా సమర్థించారు. జగన్ వ్యాఖ్యల పైన ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. జగన్ తీరును తప్పు బట్టారు. కీలక వ్యాఖ్యలు చేసారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆర్దిక మంత్రి పయ్యావుల మండిపడ్డారు. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చెయ్యాలని అనుకుంటారని చెప్పుకొచ్చారు. రౌడీలకు ఏకం చేసి ప్రజలను భయపెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెబుతు న్నారని పేర్కొన్నారు. గంజాయి, బ్లేడ్ బాచ్‌లను జగన్ ప్రోత్సాహిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజా రెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి, రప్పా..రప్పా నరుకుతాం అంటున్నాని చెప్పటం ద్వారా ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని కేశవ్ ప్రశ్నించారు. అరాచక పాలనను ప్రజలు రప్పా రప్పా నరికి ఏడాది అయిందని కేశవ్ వ్యాఖ్యానించారు.

payyavula-kesav-made-serious-comments-against-ys-jagan-palnadu-tour

ఉన్మాద నినాదాలు చేస్తున్న వారిని జగన్ నిస్సుగ్గుగా సమర్ధించుకుంటున్నారని కేశవ్ ఫైర్ అయ్యారు. జగన్ పర్యటన సమయంలో చేసిన వివాదాస్పద నినాదాలను ప్రస్తావించారు. జగన్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రులు స్పందించారు. జగన్ పల్నాడు పర్యటనలో పోలీసుల ఆంక్షల ను ఉల్లంఘించటంతో పాటుగా ర్యాలీలో ప్రదర్శించిన ప్లకార్డుల పైన మండిపడ్డారు. అటు జగన్ పర్యటన వేళ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలతో పాటుగా.. ప్లకార్డులను ప్రదర్శించిన వారి పైన పోలీసులు కేసులు నమోదు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+