లోకేష్‌పై కేశవ్, జగన్ స్థానంలో కేసీఆర్: వర్ల సెటైర్

గతంలో కంటే ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భిన్నంగా చేపడుతున్నట్లు తెలిపారు. కార్యకర్త, వారి కుటుంబ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా సౌ కర్యం కల్పించారన్నారు. నమోదిన ఆసుపత్రుల్లో 20 శాతం వరకు రాయితీ పొందవచ్చున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆసుపత్రులకు వర్తింప చేయడం జరుగుతుందన్నారు.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో రెండు కమిటీల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తెలంగాణాలో ఎన్నికల కమిటీ నేతృత్వంలోను క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాన్ని కార్యకర్తల సంక్షేమ కన్వినర్ నారాలోకేష్ సమీక్షిస్తుంటారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదుపై పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
వారం రోజుల్లోపు చంద్రబాబు సరైన వెల్లడిస్తారన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. త్వరలోనే రుణమాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందని, అందుకుగాను కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.5 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. సభ్యత్వంలో సభ్యులు రెన్యువల్, కొత్తగా నమోదు చేసుకోవడానికి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రం అనేక సమస్యలు, నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల లెక్కను ఇంతవరకు తేల్చి చెప్పలేదన్నారు. త్వరలోనే కొత్త యంత్రాంగంతో ప్రభుత్వం అభివృద్ధి దిశవైపు అడుగులు వేయడం జరుగుతుందన్నారు.
కేసీఆర్ పైన వర్ల
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాడుతున్న భాష అత్యంత నీచంగా ఉందని వర్ల రామయ్య వేరుగా అన్నారు. కేసీఆర్ భాష చూస్తుంటే ఆయన తెలుగుజాతికి చెందినవాడని చెప్పుకోవడానికే సిగ్గుపడాల్సి వస్తోందని మండిపడ్డారు.
విజయవాడలో బహిరంగసభ పెట్టి చంద్రబాబును ఎండగడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణ రైతులను ఆదుకోలేని కేసీఆర్ విజయవాడకు వచ్చి ఏం చేస్తారన్నారు. ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మౌనంగా ఉన్నారని, ఆయన స్థానంలో కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications