'సాక్షి పత్రికలో రాసి, నిమిషాల్లో జగన్ పార్టీ యు టర్న్'

సమైక్యాంధ్ర ఉద్యమానికి జగన్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. విభజనకు సహకరిస్తామని కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బెయిల్ డీల్ కుదుర్చుకుందని ఆరోపించారు. రాష్ట్రపతి పాలన దిశగా ఆ పార్టీ వెళ్తోందన్నారు. రాజీనామాల ఆమోదం కోసమంటూ స్పీకర్‌ను కలవబోతున్నట్లు సాక్షి పేపర్‌లో రాయలేదా అని ప్రశ్నించారు. నిమిషాలలో ఎలా యు టర్న్ తీసుకున్నారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు చేతిలో కీలుబొమ్మ అన్నారు. జగన్‌కు బెయిల్ రాబోతుందని ఈ నెల 17న ఎంపి సబ్బం హరి ఎలా చెప్పారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టేది ప్రభుత్వం తప్ప స్పీకర్ కాదన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ మాత్రం అవగాహన లేదా అన్నారు. మీ రాజీనామాలతో రాష్ట్రాన్ని ఏలా సమైక్యంగా ఉంచుతారో చెప్పాలన్నారు. బెయిల్ డీల్లో భాగమే రాజీనామాలన్నారు.
ప్రజల ముందు ఆ పార్టీని దోషిగా నిలబెడతామన్నారు. వారు లెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు ఆ పార్టీ సిద్ధపడిందన్నారు. తన తండ్రిని చంపారని చెప్పిన వైయస్ జగన్ ఇప్పుడు అదే పార్టీతో ఎలా ముందుకెళ్తున్నారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications