ఎన్నికల వేళ షర్మిల కీలక నిర్ణయం - గేమ్ ఛేంజర్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం రోజురోజుకీ మారుతోంది. పీసీసీ పగ్గాలు చేపట్టిన సమయం నుంచి సీఎం జగన్ లక్ష్యంగా షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సమయంలోనే ఏపీలో ఎన్నికల వేళ ఇక ప్రజల్లో ఉండాలని నిర్ణయించారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం నిరసన చేసిన షర్మిల..ఇక, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది.
ప్రజల్లోకి షర్మిల: పీసీసీ చీఫ్ షర్మిల ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. తొలి విడతగా ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలోని మూడు పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నారని విమర్శలు కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్ ఏపీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్న వేళ..అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్దమవుతోంది. దీని కోసం ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పుడు, షర్మిల జిల్లాల పర్యటనలకు సిద్దమయ్యారు. రేపు (సోమవారం) మడకశిర నుంచి షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. రచ్చబండలు, బహిరంగ సభల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు.
రచ్చబండల నిర్వహణ: రేపు (సోమవారం) సాయంత్రం అయిదు గంటలకు ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో బహిరంగ సభ జరుగుతుంది. మర్నాటి ఉదయం 10 గంటలకు శింగనమల అసెంబ్లీ స్థానం పరిధిలోని బండ్లపల్లిలో రచ్చబండ కార్యక్రమం చేపడతారు. సాయంత్రం ఐదు గంటలకు నంద్యాలలో బహిరంగ సభ ఉంటుంది.
ఏడోతేదీన ఉదయం పది గంటలకు దర్శి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రచ్చబండలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు బాపట్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 8వ తేదీన ఉదయం తెనాలి అసెంబ్లీ పరిధిలో రచ్చబండ, సాయంత్రం జంగారెడ్డిగూడెంలో సభ ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల సమరం: ఈ నెల 9న ఉదయం పది గంటలకు కొవ్వూరు అసెంబ్లీ పరిధిలో రచ్చబండ, సాయంత్రం ఐదు గంటలకు తునిలో బహిరంగ సభకు నిర్ణయించారు. పదో తేదీ ఉదయం పది గంటలకు నర్సీపట్నంలో రచ్చబండ, సాయంత్రం ఐదు గంటలకు పాడేరు బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.
ఈ సభల్లో సీఎం జగన్ తో పాటుగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు - పవన్ లక్ష్యంగా విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే షర్మిల వర్సస్ వైసీపీ పొలిటికల్ వార్ పీక్ కు చేరిన సమయంలో షర్మిల ప్రజల మధ్యకు వెళ్లనుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications