అమరావతి భూదందా కథనాలు: సాక్షి జర్నలిస్టులపై పోలీసు చర్య
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూదందాలపై వరుస కథనాలు రాసిన సాక్షి మీడియా జర్నలిస్టులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వార్తాకథనాలు రాసిన జర్నలిస్టులపై కూడా చర్యలు తీసుకుంటామని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు హెచ్చరిక నేపథ్యంలో సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. గుంటూరు పోలీసులు సాక్షి సిబ్బందిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. వార్తాకథనాలకు ఆధారాలు చూపాలని పట్టుబట్టారు.

రిపోర్టర్లనే కాకుండా డెస్క్ జర్నలిస్టులను కూడా పిలిపించి విచారించారు. అయితే, జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియా (పిసిఐ) తీవ్రంగా స్పందించింది. ఒక పత్రిక జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు పిలిపించడాన్ని తప్పు పట్టింది.
ఆధారాలు బయటపెట్టాలని అనడం పత్రికా స్వేచ్ఛకు భంగకరమని వ్యాఖ్యానించింది. ఈ కేసును పిసిఐ సూమోటా స్వీకరించింది. ఎపి ప్రభుత్వానికి, డిజిపికి, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టులు రాసిన కథనాలకు సోర్స్ చెప్పాలని ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని పిసిఐ నిబంధనల్లో ఉందని చెబుతున్నారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications