కాకినాడ పోర్టులోనే పవన్ సీజ్ షిప్-చురుగ్గా అన్ లోడింగ్-రిటర్న్ అప్పుడే..!
ఏపీలో కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, అక్రమ రేషన్ బియ్యంతో వెళ్తున్న స్టెల్లా ఎల్ 1 షిప్ ను సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గతంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాల తర్వాత స్టెల్లా ఎల్ 1 షిప్ విషయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి షాకిచ్చాయి. దీంతో స్టెల్లా ఎల్ 1 షిప్ విషయంలో తదుపరి ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న స్టెల్లా ఎల్ 1 షిప్ ను పవన్ సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చాక జోక్యం చేసుకున్న కేంద్రం ..దాన్ని వదిలేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో షిప్ లో ఉన్న రేషన్ బియ్యంతో పాటు ఇతర బియ్యం కూడా అన్ లోడ్ చేసి షిప్ ను పంపాల్సిన పరిస్ధితి వచ్చింది. అయితే వాతావరణం మాత్రం అందుకు సహకరించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు ఇచ్చినా కాకినాడ పోర్టు నుంచి షిప్ మాత్రం ఇప్పటివరకూ కదల్లేదు.

స్టెల్లా ఎల్ 1 షిప్ లో 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ బియ్యాన్ని అన్ లోడ్ చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇది పూర్తవడానికి మూడు, నాలుగు పట్టే అవకాశం ఉంది. దీంతో పాటు అనుమతులు ఉన్న బియ్యాన్ని షిప్ లోకి లోడ్ చేయాల్సి ఉంది. అలాగే మిగతా లాంఛనాలు కూడా పూర్తి చేస్తే కానీ ఈ షిప్ కాకినాడ పోర్టును వదిలివెళ్లేందుకు అవకాశం ఉండదు. దీంతో అధికారులు ఆ మేరకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. తాజా అంచనా ప్రకారం స్టెల్లా ఎల్ 1 షిప్ కాకినాడ పోర్టు నుంచి జనవరి 3 లేదా 4 తేదీల్లో బయలుదేరే అవకాశముంది.












Click it and Unblock the Notifications