అమరావతిపై చంద్రబాబుకు కేంద్రం మార్గనిర్దేశం - ఇలా చేస్తే..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అమరావతి పైనే ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు చేసారు. రాష్ట్రానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టుల పైన చర్చించారు. ఇదే సమయంలో అమరావతి ప్రణాళికలు..ఆర్దిక ఇబ్బందులపైన ప్రస్తావన చేసారు. ఈ సమయంలో అమరావతిలో నిర్మాణాల గురించి కేంద్రం చంద్రబాబు కు కీలక సూచనలు చేసింది.
చంద్రబాబు వినతులు
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణానికి అండగా నిలవాలని కేంద్రాన్ని కోరారు. తన ప్రణాళికల గురించి వారితో చర్చించారు. ప్రధాని మోదీతో సమావేశమైన సమయంలో రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రతిపాదనలు అందించారు. కేంద్రం ప్రత్యేకంగా ఆర్దికంగా చేయూత ఇవ్వాలని అభ్యర్దించారు. కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ కీలకంగా మారటంతో ఈ నెలలో ప్రతిపాదించే బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో అమరావతిలో ప్రస్తుత సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నాలు మొదలయ్యాయి.

పీయూష్ సూచన
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో అమరావతి నిర్మాణం పై చంద్రబాబు చర్చించారు. ఈ చర్చ జరుగుతున్నప్పుడే గోయల్ తన కార్యాలయం పై అంతస్తుకు చంద్రబాబును తీసుకెళ్లారు. అక్కడ్నుంచి కొత్తగా కట్టిన సెంట్రల్ విస్టాను చూపించారు. ఈ కొత్త పార్లమెంట్ భవనం దేశ ప్రజల మనసుల్లో ఓ ప్రత్యేకమైన ముద్ర వేసిందని.. అనుబంధాన్ని పెంచిందని గుర్తు చేసుకున్నారు. అందుకే అమరావతిలో పాలనా నగరాన్ని రెండేళ్లలో పూర్తి చేసి ప్రజలకు చూసేందుకు ...అందుబాటులోకి తేవాలని సూచించారు. దీని వల్ల రాజధానిపై ప్రజల్లో అనుబంధం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
రాజధాని ప్రణాళికలు
చంద్రబాబు సైతం అమరావతి తన తొలి ప్రాధాన్యతగా భావిస్తున్నారు. అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. అమరావతిలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు. అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ బాధ్యతల పై కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. ఇక..పాలనా పరంగా, సాంకేతికంగా, న్యాయ పరంగా ఉన్న చిక్కులను అధిగమించి ముందుకు వెళ్లేందుకు చంద్రబాబు సంప్రదింపులు చేస్తున్నారు. గతంలో భూములు కేటాయించిన సంస్థలు సైతం కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications