జగన్‌ను చూసి నవ్వుకుంటున్నారు: రాజేంద్ర ప్రసాద్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 20 రోజులు కూడా కాకముందే చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌సిపి నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శలకు దిగడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని తెలుగుదేశం నేత వైవిబి రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఎన్టీఆర్‌ట్రస్టు భవన్‌లో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత చంద్రబాబుపై రావల్సిన అసంతృప్తి 20 రోజులకే జగన్‌కు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నడూ అబద్దాలు చెప్పలేదని, దొంగ హామీలు ఇవ్వలేదని, విలువలు కాపాడుకుంటూ వస్తోందని అన్నారు.

ప్రజల్లో అంసతృప్తి చంద్రబాబుపై లేదని, జగన్‌పైనే ఉందని గుర్తించాలని అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చి అమలుచేయలేకపోయారని, విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడటం విడ్డూరమని అన్నారు.
గ్యాస్ పైప్‌లైన్ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని రాజేంద్రప్రసాద్ కోరారు. ప్రమాదంపై టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు, ఎంపి వై సుజనా చౌదరి, ఎమ్మెల్యే బాలకృష్ణ, టిడిపి ఫౌండేషన్ కన్వీనర్ లోకేష్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications