కిరణ్ తెలుగుతో నవ్వుతున్నరు:పొన్నం, జగ్గారెడ్డి వేడుక

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఎద్దేవా చేశారు. ఆయన ఎంపి రాజయ్యతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కిరణ్ తెలుగు మాట్లాడితే అందరు నవ్వుకుంటున్నారన్నారు. అలాంటి వ్యక్తి తెలుగు గురించి మాట్లాడటం ఏమిటన్నారు.

మంత్రుల బృందానికి(జివోఎం)కు పారదర్శకంగా సమాచారం పంపాలని పొన్నం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పైన తమకు విశ్వాసం లేదన్నారు. కేబినెట్లో అందరితో చర్చించిన తర్వాతనే మంత్రుల బృందానికి ప్రభుత్వం సమాచారం పంపించాలని డిమాండ్ చేశారు.

Ponnam Prabhakar

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దోచుకునేందుకు, దోచుకున్న సొమ్మును దాచుకునేందుకే ప్రయత్నాలు చేస్తోందని ఎంపి రాజయ్య నిప్పులు చెరిగారు. ఓట్లు, సీట్లు, సొమ్ము కోసమే ఆ పార్టీ ఉందన్నారు.

అవతరణ వేడుకల్లో జగ్గా రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలలో ప్రభుత్వ చీప్ విఫ్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రం ఇంకా విడిపోలేదు కాబట్టే తాను వేడుకలలో పాల్గొన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇలా పాల్గొనడం తప్పు కాదన్నారు. విభజన వేడుకల్లో పాల్గొంటే ద్రోహులు అని చెబుతున్న తెరాస నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర లాంటి వాళ్లు ఒకప్పుడు పాల్గొన్నారని గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎవరూ నమ్మవద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+