హైదరాబాద్‌పై కిరికిరి, సవాల్‌కు టి సిద్ధంగా ఉండాలి: కెకె
హైదరాబాద్: హైదరాబాదు పైన కిరికిరి రావడం ఖాయమని, తెలంగాణ సమాజం అంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు మంగళవారం అన్నారు. హైదరాబాదు పైన ఎలాంటి కిరికిరి వచ్చినా దానిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రాంత నేతలు ఐక్యంగా ఉండాలన్నారు. అలాగే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అన్నింటికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సంస్కృతిని చాటుదాం: జానా రెడ్డి
మన సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుదామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన అలయ్ బలయ్ కార్యక్రమానికి జానా రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐక్యంగా కలిసి అభివృద్ధి సాధించుదామన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలగా తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు కలిసిమెలిసి ఉండాలని బండారు దత్తాత్రేయ అన్నారు. యువ తెలంగాణ నవ తెలంగాణ సాధించుకుందామన్నారు.
కాగా, దసరా సందర్భంగా దత్తాత్రేయ జలవిహార్ వద్ద ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మంత్రి జానా రెడ్డి, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టిజెఏసి చైర్మన్ కోదండరామ్, ఎంపి వి హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications