చంద్రబాబును ఏకిపారేసిన పేర్ని నాని; బండి సంజయ్ పైనా ఘాటువ్యాఖ్యలు!!
ఓటర్ల జాబితాలో అక్రమాలపై టీడీపీ పై, బిజెపి ఎంపీ బండి సంజయ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందని చేసిన ఆరోపణలను మాజీ మంత్రి పేర్ని నాని తప్పు పట్టారు. నేడు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పక్క రాష్ట్రంలో పదవి పోయిన వాడు వచ్చి ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై మాట్లాడుతున్నారని బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పేర్ని నాని. ఆయనకు దేవుడు పైన ఊడ కొడితే, బీజేపీ కింద ఉన్న చైర్ ఊడగొట్టిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ బట్టతల పైన, అలాగే బిజెపి తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం పైన పేర్ని నాని ఘాటుగా విమర్శలు చేశారు.

ఉత్తర భారత దేశంలో బీజేపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తున్నట్టు ఏపీలో జరుగుతుందని అనుకున్నారా? అంటూ బండి సంజయ్ ని ఉద్దేశించి పేర్ని నాని ప్రశ్నించారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్న బండి సంజయ్ పైన ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాల గురించి బండి ఇటీవల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పేర్ని నాని ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
2019కి ముందు 59.18లక్షల ఓట్లు అక్రమంగా ఉన్నాయని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అక్రమ ఓట్లు ఉన్న పరిస్థితి ఇప్పటికీ ఉందని, ఓటర్ల జాబితాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని ఈసీని తాము కోరామని పేర్కొన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును టార్గెట్ చేసిన పేర్ని నాని ఏపీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని టిడిపి గగ్గోలు పెడుతుందని, ఓటర్ల జాబితా విషయంలో పాపాలు చేసింది చంద్రబాబునేనని పేర్ని నాని విమర్శించారు.
టిడిపి చేసిన పాపాల వల్ల ఇప్పుడు ఏపీలో భారీగా నకిలీ ఓటర్లు ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. దొంగ ఓటర్లను చేర్చి గెలవాలనే ఆలోచన చంద్రబాబుకు మాత్రమే వస్తుందని పేర్ని నాని అన్నారు. ఆవు తోలు కప్పుకున్న నక్కలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నాడని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications