కేసీఆర్ ఢిల్లీకి దేని కోసం: బయట కాలర్ ఎగరేటం-లోపల కాళ్లు పట్టుకోవటం: జగన్ ఢీ అంటే ఢీ : పేర్ని నాని కౌంటర్...!!

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి..రాష్ట్రం పైన చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో సంక్షేమ పధకాల అమలు..రావాల్సిన నిధుల కోసం వెళ్లి కేంద్రాన్ని అప్పు అడుగుతున్నామో...మా పరిస్థితి బాగోలేదు...మేము అడుక్కు తింటున్నామో.. ఏం చేస్తున్నామో సరేనని వ్యాఖ్యానించారు. కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని.. ఏం బిచ్చం అడుక్కోవానికి వెళ్తున్నారని ప్రశ్నించారు. మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బయట కాలర్ ఎగరేయటం.. లోపలకు వెళ్లి కాళ్లు పట్టుకోవటమా అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పైన పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పైన పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

మేము కేంద్రంలో చేరుతాం. మాకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వండి..ఇలా లోపల ఒక రకంగా..బయట ఒక విధంగా వ్యవహరించటం జగన్ కు చేతకాదని మంత్రి నాని స్పష్టం చేసారు. తెలంగాణలో ఆర్దిక పరిస్థితి బాగుందని చెబుతున్నారు...బ్యాంకుల్లో విచారించండంటూ సూచించారు. బిల్లులు సంగతి కాంట్రాక్టర్లను అడిగితే చెబుతారని మంత్రి చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం అరబ్ దేశాల నుంచి సైతం అప్పు కావాలంటూ తెలంగాణకు వచ్చారని ఎద్దేవా చేసారు.

తెలంగాణ పరిస్థితి ఏంటో తెలుసుకోండి

తెలంగాణ పరిస్థితి ఏంటో తెలుసుకోండి

ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి డెవలప్ చేసిన హైదరాబాద్ సొమ్మును ఆ ప్రభుత్వం అనుభవిస్తోందని..కాంగ్రెస్ ప్రభుత్వం నాడు హైదరాబాద్ ను తెలంగాణకు కట్టబెట్టిందని చెప్పుకొచ్చారు. ఏదైనా సమస్య ఉంటే మీరు బీజేపీ తేల్చుకోండి..ఏపీ పైన ఎందుకు పడటం అంటూ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇక, అంతకు ముందు చంద్రబాబు పైన మంత్రి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. రైతుల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా రైతులను వాడుతున్నారని మం పేర్ని నాని అన్నారు.

చంద్రబాబు - లోకేశ్ పైన నాని ఫైర్

చంద్రబాబు - లోకేశ్ పైన నాని ఫైర్

ఈ యాత్రకు చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని మంత్రి అన్నారు. చంద్రబాబు తాబే దార్లు న్యాయమూర్తులకు కళ్లకు గంతలు కట్టి యాత్ర చేస్తున్నారన్నా రు. పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, కర్త, క్రియ అన్ని చంద్ర బాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. ఈ యాత్ర పేరుతో తన బ్లాక్ మనీని చంద్రబాబు వైట్ మనీగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్‌ను మానసిక వైద్యులకు చూపించాలన్నారు. కుప్పంలో ఓటుకు 1500, 2000 రూపాయలు ఓటర్లకు ఇస్తు లోకేష్ తిరుగుతుందన్నది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. 1989 నుంచి ఇప్పటి వరకు కుప్పంకు చంద్రబాబు ఎమ్మెల్యేనే కదా...హంద్రీనీవా నీళ్లను ఎందుకు తీసుకు రాలేదో చెప్పా లన్నారు. రెండేళ్లల్లో ఏం పీకార్రా...అని లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి పేర్ని నాని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+