బీజేపీతో చంద్రబాబు పొత్తుపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల వేళ కొత్త రాజకీయం మొదలైంది. పొత్తుల లెక్కల పైన ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. టీడీపీ తిరిగి ఎన్డీఏ చేరుతుందనే ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబుతో భేటీ అనంతరం పొత్తు ఖాయమనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, ఢిల్లీలో సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా చేస్తున్న పొత్తుల ప్రయత్నాలు మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్‌ను రాజకీయంగా ఒంటరిగా ఎదుర్కోలేక పవన్, బీజేపీని చంద్రబాబు తెచ్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో చంద్రబాబు అర్ధరాత్రి చర్చలు నడిపారని మాజీమంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాడు ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు వెళ్లారు..ఇప్పుడు తిరిగి ఏ న్యాయం చేసారని కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. 2014లో ఏపీ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ అవసరమన్నారని గుర్తు చేసారు. బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగారని ఎద్దేవా చేసారు.

నాలుగేళ్లు కాపురం చేసి చివరి ఆరునెలల్లో బీజేపీపై చంద్రబాబు బూతులు తిట్టారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ వ్యక్తిగత అంశాల పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కుటుంబం కూడా లేనోడు తనతో పోటీనా అన్నారని గుర్తు చేసారు. ఈడీతో బెదిరిస్తావా.. ఏం చేస్తావో చేసుకో అన్నారని వివరించారు. బీజేపీతో ఎందుకు కలిసి పోటీచేయాలో చంద్రబాబు ప్రజలకు చెప్పాలన్నారు. బీజీపీ, టీడీపీ చేసిన పాపాలకు ప్రజలకు క్షమాపణ చెబుతారా అని పేర్ని నాని ప్రశ్నించారు.
రాజకీయాలు కావాలి అని ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వస్తారా అని నిలదీసారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్రానికి ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు.ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా..పోలవరం పూర్తి అయిదా..రైల్వే జోన్ ఇచ్చారా అంటూ ప్రశ్నలు సంధించారు. పోలవరం నిర్వాసితులకు ఈ రోజుకు నయా పైసా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications