మంత్రివర్గ ప్రక్షాళన పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ కల్యాణ్ పైన మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. 175 స్థానాల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేసారు. పొత్తులు లేకుండా..175 స్థానాల్లో పోటీ చేసే సత్తా లేని చంద్రబాబు ఏ స్థాయిలోనూ జగన్ తో పోటీ పడలేరని వ్యాఖ్యానించారు. అమరావతికి వచ్చిన బీజేపీ నేతలు ముఖ్యమంత్రిని అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. విశాఖ రాజధానిగా అన్ని రకాలుగా అనుకూలమని పవన్ చెప్పలేదా అని ప్రశ్నించారు. పులివెందులలో పోటీకి చంద్రబాబు - పవన్ రావాలని పేర్ని నాని సవాల్ చేసారు.

175 నియోజకవర్గాల్లో టీడీపీకి పోటీ చేస్తుందా
175 నియోజకవర్గాల్లో టీడీపీకి పోటీ చేసే దమ్ముందా అని పేర్ని నాని ప్రశ్నించారు. వై నాట్ పులివెందుల అంటూ సినిమా డైలాగులు కాదని.. నేరుగా చంద్రబాబు, పవన్ ముఖ్యమంత్రితో పులివెందులలో పోటీకి దిగాలని పేర్ని నాని ఆహ్వానించారు. అందరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదన్నారు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తున్నారో ముందు చంద్రబాబు చెప్పాలన్నారు. అందరూ కలిస్తే కానీ, జగన్ పైన పోటీ చేసే ధైర్యం లేని వారంతా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. కమ్యూనిస్టు పార్టీని నారాయణ చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఎన్ని సీట్లు.. బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్లకు ఎన్ని సీట్లు ఇస్తున్నారో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారన్నారు.

Perni Nani Strong counter for Chandra Babu on his comments against CM Jagan

పులివెందులలోనే తేల్చుకుందాం
జగన్ ను ఓడించగలమనే ధైర్యం ఉంటే పులివెందుల రావాలని పేర్ని నాని ఆహ్వానించారు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి ప్రపంచాన్ని గెలిచినట్లుగా సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేసారు. 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ ఇన్ని స్థానాలు గెలిచినా ఎక్కడా ఇలా చేయలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుతుకున్నారన్నారు. అమరావతి ప్రాంతంలో టెంట్లు వేసి అద్దె మైకు గాళ్లను పిలిచి మాట్లాడించారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి గురించి అసభ్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ 2018 లో చేసిన కర్నూలు డిక్లరేషన్ ఏమైదని పేర్ని నాని ప్రశ్నించారు. రాయలసీమలో హైకోర్టు చేసిన డిక్లరేషన్ ఏమైందని నిలదీసారు.

కేబినెట్ విస్తరణ ఉండదు
మంత్రివర్గ ప్రక్షాళన ఉండదని పేర్ని నాని స్పష్టత ఇచ్చారు.ఈ మంత్రివర్గంతోనే ఎన్నికలకు వెళ్లి గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. కర్నూలును రెండో రాజధాని చేయాలని బీజేపీ నేతలు చెప్పిన అంశాన్ని పేర్ని నాని గుర్తు చేసారు. 2019లో బీజేపీ మ్యానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు లు ఏర్పాటు చేస్తాం అన్నారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వస్తే కర్నూలు రాజధాని అని పవన్ గతంలో చెప్పలేదా అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజల్లో ఎవరు ఏంటో తేల్చుకొనేందుకు సిద్దమని చెప్పారు. సినిమా డైలాగులు రాసుకొచ్చి మాట్లాడటం కాదని.. ప్రజల్లో పోటీకి సిద్దం కావాలని పేర్ని నాని సవాల్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+