పొట్టేళ్ల రప్పా రప్పా వివాదం-వైసీపీ శ్రేణులకు పేర్ని కీలక సూచన..!
ఏపీలో తాజాగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పొట్టేళ్లను నరికి రక్త తర్పణాలు చేసినట్లు అధికార కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, కార్యకర్తల్ని వీధుల్లో నడిపించడం వంటి చర్యలకు దిగారు. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. ఓవైపు కూటమి సర్కార్ తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు తమ క్యాడర్ కూ కీలక సూచన చేసింది.
తాజాగా పొట్టేళ్ల రక్తతర్పణాల వ్యవహారంలో వైసీపీ క్యాడర్ ను ప్రభుత్వం టార్గెట్ చేయడంపై ఆ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని పైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు, బాలకృష్ణ పుట్టినరోజులు, గెలుపుల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు చేసిన రక్త తర్పణాల వీడియోల్ని ఆయన బయటపెట్టారు. గత వైసీపీ హయాంలోనే జరిగిన ఇలాంటి చర్యలపై కూటమిలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు స్పందించలేదని పేర్ని ప్రశ్నించారు. అప్పుడే పవన్ స్పందించి వాళ్లను మోకాళ్లపై నిలబెట్టి, కాలుకు కాలు కీలుకు కీలు తీసి ఉంటే ఇలాంటివి ఇప్పుడు పునరావృతం అయ్యేవి కావన్నారు.

ఈ రాష్ట్రంలో మీరు రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగడం వల్లే మా వాళ్లు రప్పా.. రప్పా అని అంటున్నారని పేర్ని కౌంటర్ ఇచ్చారు.గదిలో పెట్టి పిల్లిని కొడితే తిరగబడుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు పిల్లి కంటే తక్కువా ?, వాళ్లు వెధవల్లా పరిపాలించారు, మనమెందుకు చేయాలనే మేం చెప్తున్నామన్నారు రేపు మనకూ రిటైర్ అయిన అధికారులు వస్తారు, సిట్ లు వేస్తాం. తప్పులు చేయొద్దని వైసీపీ కార్యకర్తలకు పేర్ని సూచించారు. చట్ట పరిధిలో తప్పులు చేసిన వాళ్లను శిక్షిద్దాం. కాబట్టి వీళ్లను చూసి మీరు తప్పులు చేయకండి అన్నారు.












Click it and Unblock the Notifications