వైసీపీకి కొడాలి నాని, వంశీ గుడ్ బై..? క్లారిటీ ఇచ్చేసిన సీనియర్ నేత
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని, ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని , వల్లభనేని వంశీ వైసీపీని వీడుతారా అనే ప్రశ్నకు పేర్ని నాని తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను ఎన్టీఆర్ వారసుడిని అని చెప్పుకునేవారని,ఆయన రాజకీయాల్లోకి వస్తే జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం ఉండదని నాని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తే టీడీపీకి నష్టం చేకూరుతుంది కానీ, వైసీపీకి ఎలా నష్టం వాటిల్లుతుందని ఆయన తిరిగి ప్రశ్నించారు.

కొడాలి నానితో తనకు 25 ఏళ్లుగా సాన్నిహిత్యం ఉందని, తామిద్దరం భిన్న అభిప్రాయాలతో ఉన్నప్పటికీ స్నేహం కొనసాగిస్తామని చెప్పారు. ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే, కొడాలి నాని జగన్ మోహన్ రెడ్డిని విడిచిపెట్టరని తాను గట్టిగా చెబుతానని, ఒకవేళ అలా జరిగితే దానికి తాను బాధ్యత తీసుకుంటానని నాని బలంగా నొక్కి చెప్పారు.
అయితే, వల్లభనేని వంశీ గురించి అడిగినప్పుడు, వంశీతో తనకు అంత చనువు లేదని, ఆయన మనసులో ఏముందో తనకు తెలియదని, అందుకే ఆయన గురించి వ్యాఖ్యలు చేయలేనని చెప్పారు. పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.












Click it and Unblock the Notifications