భార్య, భర్త గొడవ: ఆపేందుకు వెళ్లిన వ్యక్తి దారుణ హత్య
అమరావతి: అనంతపురం జిల్లాలోని కోడేరు మండలం శివరాం పేటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవను ఆపేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై భర్త కొడవలితో అతికిరాతకంగా దాడి చేశాడు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలతో గాయపడ్డ ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుతషాక్‌తో తండ్రీకొడుకుల మృతి
అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం మల్లపల్లెలోని ఓ మాంసం దుకాణంలో విద్యుత్తు షాక్‌తో తండ్రీకొడుకు మరణించారు. పోలీసుల కథనం ప్రకారం కోడి ఒకటి తప్పించుకొని పోగా దానిని పట్టుకునేందుకు ముస్తఫా వెళ్లి ఓ ఇనుప రాడ్డుని పట్టుకున్నారు.
దీంతో కరెంట్ షాక్ తగిలి ముస్తఫా అక్కడికక్కడే చనిపోయాడు. తండ్రి ముస్తఫాను కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో కొడుకు దాదాపీర్ (28) కూడా కరెంట్ షాక్ తగలడంతో మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో మల్లపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇంట్లో అగ్నిప్రమాదం: రూ.3 లక్షల ఆస్తి నష్టం
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని పిల్లావారివీధిలో శివప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగింది.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications