హైదరాబాద్‌లో కుక్క కాటుపై కేసు: యజమాని అరెస్ట్

మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయి కిరణ్ తన ఇంట్లో ఓ పెంపుడు కుక్కను పెంచుకుటున్నారు. అతని ఇంటికి ఎదురుగా భారతి అనే మహిళ పిల్లల సంరక్షణ కేంద్రాన్ని నడుపుతోంది.
కాగా గురువారం రోజు భారతి కూతురు సత్య అతిథి కేంద్రం ఎదుట రోడ్డుపై ఉండగా ఆ కుక్క ఆమెను కరిచింది. గాయాలపాలైన బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెంపుడు కుక్క యజమాని సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ 298(నిర్లక్ష్య ప్రవర్తన) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications