వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామాంధుడి నుండి బాలికను కాపాడిన కుక్క .. విశ్వాసం అంటే ఇదే మరి !!

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లాలో తన ఇంటి డాబాపై నిద్రిస్తున్న ఓ అమ్మాయి పట్ల ఓ కామాంధుడు అమానుషంగా ప్రవర్తించబోయాడు. అత్యాచారానికి ప్రయత్నించబోయాడు. ఈ క్రమంలో సదరు అమ్మాయి పెంచుకుంటున్న కుక్క తన తడాఖా చూపించి, ఆ 17 ఏళ్ల బాలికను కామాంధుడి బారి నుండి కాపాడింది. ఇక ఈ ఘటనలో తన విశ్వాసాన్ని నిరూపించుకుని ఆ కుక్క అందరి దృష్టిలో హీరోగా నిలిచింది.

విశ్వాసానికి ప్రతిరూపం శునకం .. మరోమారు నిరూపించిన కుక్క

విశ్వాసానికి ప్రతిరూపం శునకం .. మరోమారు నిరూపించిన కుక్క

విశ్వాసానికి ప్రతిరూపంగా కుక్కని భావిస్తుంటారు. తనను పెంచుకునే యజమానికి కాపలాగా ఉండే కుక్క చివరి వరకూ తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కుక్క చూపించే విశ్వాసంపై ఎన్నో ఆసక్తికర సంఘటనలు గతంలో వెలుగుచూశాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కరోనా కష్టకాలంలో కరోనా మహమ్మారితో యజమాని చనిపోయినా అయిన వాళ్ళందరూ దూరంగా ఉన్నా, పెంపుడు కుక్కలు మాత్రం ఆ యజమానితో చివరి వరకు సాగిన దృశ్యాలు అనేకం చూశాం. ఇక తాజాగా చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని గొల్లపల్లె గ్రామంలో జరిగిన సంఘటన కుక్క విశ్వాసాన్ని మరోసారి రుజువు చేస్తుంది.

17 ఏళ్ళ బాలిక మానం కాపాడిన కుక్క .. కామాంధుడిని కరిచి బాలికకు రక్షణ

17 ఏళ్ళ బాలిక మానం కాపాడిన కుక్క .. కామాంధుడిని కరిచి బాలికకు రక్షణ

17 ఏళ్ల బాలిక ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క తన యజమానికి చిన్న ఆపద కలిగితే తన విశ్వరూపాన్ని చూపించింది. గొల్లపల్లి గ్రామంలో డాబాపై నిద్రిస్తున్న 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని కుక్క విఫలం చేసింది. తనపై బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న నిందితుడి నుండి తప్పించుకోవడానికి బాలిక సహాయం కోసం కేకలు వేయగా వెంటనే పెంపుడు కుక్క ఆమెను రక్షించి, నిందితుడిపై దాడి చేసి అతనిని కరిచింది.

Recommended Video

Telangana:Arrangements At Telangana Legislative Assembly On The Occasion Of Budget Sessions In March
తప్పించుకు పారిపోయిన నిందితుడు .. కేసు నమోదు , నిందితుడు అరెస్ట్

తప్పించుకు పారిపోయిన నిందితుడు .. కేసు నమోదు , నిందితుడు అరెస్ట్


కుక్క దాడి నేపథ్యంలో నిందితుడు అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వాళ్ళు లేచి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసి, చివరకు పోలీసులకు సమాచారం అందించారు.కేసు నమోదు చేసిన పోలీసులు పెనుమూరు బస్‌స్టాండ్‌లో బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు పంపారు. ఏది ఏమైనా తన యజమాని పట్ల విశ్వాసాన్ని చూపి, అత్యాచారం నుంచి కాపాడిన శునకం ఇప్పుడు ఆ గ్రామంలో చర్చనీయాంశమైంది. యజమాని పట్ల కుక్క విశ్వాసాన్ని, ప్రేమను అందరూ మెచ్చుకుంటూ సదరు కుక్కకు కితాబిస్తున్నారు.

English summary
A dog is known to be man’s best friend. The incident at Gollapalle village of Penumuru mandal in the district proves this once again. The pet rushed to the rescue of a 17-year-old girl and foiled the rape attempt of a 27-year-old man of the same village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X