ఆర్టీఐ కమిషనర్ నియామక వివాదం! వైసీసీ వద్దంటోంది.. టీడీపీ కావాలంటోంది.. ఎందుకు?
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే ముందు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. సమాచార హక్కు కమిషనర్‌గా రాజా నియామకం పైన జనచైతన్య వేదిక హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన సమయం నుండి ఈ పేరు మీద వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా హైకోర్టు కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
హైకోర్టుకు ఆర్టీఐ వ్యవహారం..
ఏపీ ప్రభుత్వం ఎన్నికల ముగిసి..ఫలితాలు రావాల్సిన సమయంలో సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా రాజాను నియమించింది. అయితే, సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వం ఆయనకు హోదా కట్టబెట్టిందని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐలాపురం రాజాను ఏపి ప్రభుత్వం సమాచార హక్కు కమిషనర్‌గా ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ఈ పేరుతో పాటుగా ఒక మంత్రి వద్ద పీఎస్‌గా పని చేస్తూ..గతంలో రెవిన్యూ సర్వీసుల నుండి స్వచ్చంద పదవీ విరమణ చేసిన మరో వ్యక్తి పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, గవర్నర్ దీని పైన వివరణ కోరిన అనంతరం ఐలాపురం రాజా పేరుకు మాత్రమే ఆమోద ముద్ర వేసారు. అయితే, వ్యాపార రంగంలో ఉన్నవారు సమాచార హక్కు కమిషనర్‌గా అర్హులు కాదంటూ జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

నియామకం రద్దు చేయాలి..
ఏపీ ప్రభుత్వం తమ టర్మ్ ముగుస్తున్న సమయంలో తమ వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నియామకం చేపట్టిందని వైసీపీ ఇప్పటికే ఆరోపణలు చేసింది. దీని పైన హైకోర్టులో లంచ్‌మోషన్‌లో వాదనలు సాగాయి. సెక్షన్-50లోని క్లాజ్3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పొన్నవోలు అర్గ్యుమెంట్ చేశారు. సెక్షన్-15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్‌గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వాదించారు.
సేవాదృక్పధం, జ్ఞాన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ప్రభుత్వం మారే సమయంలో ఇష్టులకి పదవుల పందేరంలో భాగంగానే ఐలాపురం పేరు సూచించారని ఆరోపించారు. అర్గ్యుమెంట్స్ విన్న తర్వాత విచారణను ఈ నెల 29కి హైకోర్టు వెకేషన్ బెంచ్ వాయిదా వేసింది. అలాగే ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటికి కొత్త ప్రభుత్వం ఏపీలో ఏర్పడనుంది.












Click it and Unblock the Notifications