తెలంగాణలో టీవీ చానెళ్ల బ్యాన్‌పై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల్లో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిషేధానికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అలాగే ఈ రెండు ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

తెలంగాణ 10 జిల్లాల్లో ఏబీఎన్, టీవీ-9 ఛానళ్ల ప్రసారాలు నిలిపిపేయడంపై వెంకట నారాయణ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాచార చట్టం హక్కును హరిస్తూ ఎంఎస్‌వోలు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఆచేతనంగ ఉండిపోయిందని వెంకట నారాయణ ఆ పిటిషన్‌లో అన్నారు.

 Petition filed challenging ban on TV channels

దీనికి సంబంధించి తాము నెలకు రూ. 180లు చెల్లిస్తున్నామని, తమకు అవసరమైనటువంటి ఛానల్స్ చూసే అవాకాశం ఉన్నప్పటికీ ఎంఎస్‌వోల నిర్ణయంతో తాము ఆ రెండు ఛానల్స్‌ను చూడలేక పోతున్నామని ఆయన పిటిషనల్‌లో చెప్పారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో వెంకటనారాయణ పేర్కొన్నారు.

తెలంగాణ శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో ప్రసారాలు చేశారనే ఆరోపణపై ఆ రెండు చానెళ్ల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు చానెళ్ల ప్రసారాలను ఎంఎస్‌వోలు నిలిపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+