వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానికత గొడవ: తెలంగాణ కుటుంబ సర్వేపై పిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Petition filed challenging Telangana survey
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సునీతాలక్ష్మి అనే మహిళ ఈ పిల్‌ను దాఖలు చేశారు. వివరాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిని అనుసరించడం లేదని ఆమె అన్నారు. సర్వేపై గెజిట్ కూడా విడుదల చేయాలని విమర్సించారు. సర్వే ఆర్టికల్స్ 19, 21కి విరుద్ధమని అన్నారు.

స్థానికతను నిర్ణయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను తలపెట్టింది. ఈ నెల 19వ తేదీన ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 1956ను కొలమానంగా తీసుకుని స్థానికతను నిర్ణయించి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. సర్వేకు అందుబాటులో ఉండడానికి ప్రతి ఒక్కరూ ఆ రోజు ఇంట్లోనే ఉండాలని ఆదేశించింది. అందుకు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు సెలవును కూడా ప్రకటించింది.

సమగ్ర కుటుంబ సర్వేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. స్థానికతను 1956 ప్రాతిపదికగా ఎలా నిర్ణయిస్తారని అడుగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిల్ దాఖలైంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

స్థానికత నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని బిజెపి కూడా విమర్శిస్తోంది. స్థానికతను ఆధారం చేసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు మడిపడుతున్నారు.

English summary

 PIL filed by Sunithaa Lakshmi, challenging comprehensive family survey of Telangana goverment in High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X