పవన్ పై గ్యాగ్ ఆర్డర్-ఫుటేజ్ డిలీట్-హైదరాబాద్ కోర్టులో పిటిషన్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. గతంలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇమ్మనేని రామారావు అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని, మరోసారి మాట్లాడకుండా అడ్డుకోవాలని, అలాగే గతంలో మాట్లాడిన వీడియోలు కూడా ఇంటర్నెట్ నుంచి తొలగించాలని పిటిషనర్ కోర్టును కోరారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గతంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంతో పాటు పలు అంశాల్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే ఇంటర్నెట్ లోనూ ఈ వ్యాఖ్యల వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీటిని వైరల్ చేశారు. అయితే ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు తర్వాత కాస్త శాంతించింది. కానీ వీడియోలు మాత్రం ఇంటర్నెల్ లో అలాగే ఉన్నాయి.

petition for gag order and removal of pawan kalyan s Tirumala laddu remarks footage from internet

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోసారి తిరుమల లడ్డూపై మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును పిటిషనర్ ఇమ్మనేని రామారావు కోరారు. అలాగే ఇంటర్నెట్ నుంచి కూడా పవన్ వ్యాఖ్యల వీడియోలు తొలగించేలా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ రామారావు కోర్టును కోరారు. దీనిపై ఇవాళ లంచ్ బ్రేక్ తర్వాత కోర్టు విచారణ జరిపే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+