వాహనదారులకు షాక్ : ఇండియా అంతటా పెట్రోల్ బంకుల బంద్!
గుంటూరు: పెట్రోల్ డీలర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తోన్న అలసత్వ వైఖరికి నిరసనగా దేశ వ్యాప్త బంద్‌కు సిద్దమయ్యారు పెట్రో డీలర్లు. ఇందులో భాగంగా.. ఈ నెల 19, 26 తేదీలలో సాయంత్రం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 3, 4 తేదీల్లోను ఆయిల్ కొనుగోళ్లు ఆపేయనున్నట్లు తెలిపారు.
నవంబర్ 5న సాయంత్రం 6గంటలకు పెట్రోల్ బంక్‌లు మూసివేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రావిగోపాలకృష్ణ ప్రకటించారు. నవంబర్ 6వ తేదీ కూడా పెట్రో బంకులను తెరవమని చెప్పారు. ప్రతీ నెలా 2,4 శనివారాలతో పాటు ప్రతీ ఆదివారం మరియు సెలవు దినాల్లోను పెట్రోల్ బంక్ లు బంద్ చేస్తున్నట్లుగా అసోసియేషన్ ప్రకటించింది.

తమ సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చి మొరపెట్టుకున్నా లాభం లేకపోవడంతో.. బంద్ లకు సిద్దమైనట్లుగా పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ తెలిపింది. పెట్రో డీలర్ల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే వాహనాదారులకు తీవ్ర ఇక్కట్లు తప్పవు.












Click it and Unblock the Notifications