'ఫోన్ ట్యాపింగ్ కిటుకు నేర్పిందే బాబు' 'కేసీఆర్‌కు 10సార్లు షాకిచ్చినా'

హైదరాబాద్: ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసే చిట్కాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆదివారం మండిపడ్డారు.

2009లో తెరాసతో సాధారణ ఎన్నికల్లో కుమ్మక్కు అయింది ఎవరని ప్రశ్నించారు. వైసీపీ, తెరాస మధ్య కుమ్మక్కు లేదన్నారు.

తాను తప్పు చేసి ఆ తప్పు ఆంధ్రా ప్రజలు చేసినట్లుగా చంద్రబాబు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. పట్టిసీమ ప్రాజెక్టు డబ్బు తెచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బుక్కయ్యారన్నారు.

సెక్షన్ 8పై గవర్నర్‌కు సోమిరెడ్డి

'Phone tapping techniques known to Telugu people by Chandrababu Naidu'

తెలంగాణ రాష్ట్ర సర్కారుకు కోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా కేసీఆర్ మారడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా అన్నారు. కేసీఆర్ భాష అసహ్యించుకునేలా ఉందన్నారు.

ఇరు రాష్ట్రాల వివాదానికి కేసీఆర్ సర్కారే కారణమన్నారు. ఏడాదిలో పది అంశాల పైన తెలంగాణ సర్కారుకు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయన్నారు. కోర్టుకు తెలుస్తున్నా గవర్నర్‌కు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పైన గవర్నర్ వివక్ష చూపిస్తున్నారన్నారు.

తెలంగాణ సర్కార్ ప్రతి అంశాన్ని వివాదం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ భాష అసహ్యించుకునేలా, ఇరు రాష్ట్రాల వివాదానికి కారణం టీ సర్కారు, కోర్టులు అక్షింతలు వేసినా కేసీఆర్ మారడం లేదు, ఏడాదిలో పది అంశాలపై టీ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు, కోర్టుకు తెలుస్తున్నా గవర్నర్ కు తెలియడం లేదు, ఏఫీపై గవర్నర్ వివక్ష, ప్రతి అసాన్ని టీ సర్కార్ వివాదం చేస్తోంది,

ఉమ్మడి రాజధాని హదైరాబాదులో సీమాంధ్రుల హక్కులకు భంగం కలుగుతుంటే గవర్నర్ చోద్యం చూస్తున్నారన్నారు. రాజధానిలో సెక్షన్ 8 ద్వారా తనకు సంక్రమించిన విశేష అధికారాలను ఆయన వినియోగించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

ఒకటో తరగతి విద్యార్థికి సైతం విపులంగా అర్థమయ్యే సెక్షన్ 8 విధివిధానాలు అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. గవర్నర్ పైన తమకేమీ ద్వేషం లేదని, కానీ బాధ్యత మరిచి చేతులు కట్టుకొని కూర్చున్న వైఖరిని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామన్నారు.

కేసీఆర్ భాష అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉందని మండిపడ్డారు. సాటి సీఎంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పైన ఇష్టారాజ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసలు విభజన చట్టాలన గౌరవించే సంస్కారం తెలంగాణ సర్కారుకు లేకుండా పోయిందన్నారు.

కేసు నమోదు చేయకుంటే లాలూచీ పడ్డట్లే: మధు

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పైన కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయకుంటే కేంద్రం, తెరాసలు బాబుతో లాలూచీ పడినట్లేనని భావించవలసి ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+