వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు 12: బస్సు నడిపిన ఏపీ మంత్రి (ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు వందరోజుల ప్రణాళిక అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘవ రావు సోమవారం అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో కనిగిరి - చెన్నై, ఒంగోలు - గుంటూరు సర్వీసు బస్సులను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా బస్సులను నడుపుతామన్నారు. ప్రజల సౌకర్యార్థం రాష్ట్రంలో 1500 కొత్త బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Photo: Transport Minister Sidda Raghava Rao drives Bus

బస్ స్టేషన్లను శుభ్రపర్చడం, మరమ్మతులకు గురైన బస్సులకు మరమ్మతులు చేయడం, బస్సులను సకాలంలో నడపడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఒకరోజు వేతనం నాలుగు కోట్ల రూపాయలను ఆర్టీసీ సంస్థకు అందించడం ద్వారా 24 బస్సులను కొనుగోలు చేసి తెలంగాణకు 12, ఆంధ్రప్రదేశ్‌కు 12 కొత్త బస్సులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

English summary
Andhra Pradesh Transport Minister Sidda Raghava Rao drives Bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X