కన్నీరుమున్నీరు: బాబు పరామర్శ, జగన్ ఆగ్రహం, బస్సు ప్రమాదం (పిక్చర్స్)

అనంతపురం: ఏపీ అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో బుధవరం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణంచిన వారి సంఖ్య 16కు చేరింది. ఆర్టీసీ బస్సు మడకశిర నుంచి పెనుకొండకు వెళ్తున్న సమయంలో అదుపు తప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హిందూపురం, పెనుకొండ, అనంతపురం, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు.

ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ మరణంచిన వారితో కలిపి మృతుల సంఖ్య 16కు చేరింది. ప్రమాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, గవర్నర్ నరసింహన్, మంత్రులు, పలువురు నేతలు దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు ఫోన్‌ద్వారా పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని అనంతపురం కలెక్టర్‌ సొలమన్‌ ఆరోగ్యరాజ్‌, ఎప్పీ రాజశేఖర్‌ బాబును, చంద్రబాబు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జగన్‌ ప్రమాదా స్థలానికి చేరుకొని, పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అదించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పైన మండిపడ్డారు. బస్సు ప్రమాదం తప్పు ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పును డ్రైవర్ మీదకో, మరెవరి మీదకో తోస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదన్నారు. ప్రమాదం జరిగిన చోట బారీకేడ్లు లేవని, దానివల్లే మరణించారన్నారు. మరోసారి ఇలాంటి చర్యలు జరక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు.

తునాతునకలైన బస్సు

తునాతునకలైన బస్సు

ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం మేరకు.. ఆర్టీసీ బస్సు ఉదయం 8 గంటల సమయంలో దాదాపు 60 మంది(42 సాధారణ టికెట్‌, 24 స్టూడెంట్ పాస్‌) ప్రయాణీకులతో మడకశిర నుంచి పెనుకొండకు వస్తోంది.

లోయలో పడిన బస్సు

లోయలో పడిన బస్సు

పెనుకొండ చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్ల దూరమే ఉన్న సమయంలో బస్సు అదుపుతప్పి 40 అడుగుల లోయలో పడిపోయింది.

కుటుంబ సభ్యుల రోదన

కుటుంబ సభ్యుల రోదన

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. కాగా, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

బస్సు

బస్సు

మడకశిర నుంచి పెనుకొండ వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడానికి ప్రధాన కారణం ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు నిర్లక్ష్యంగా చేపట్టడమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

మడకశిరకు వెళ్లే రోడ్డును పై నుంచి బ్రిడ్జి కింద వెళ్లేలాగా నిర్మాణపనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా రోడ్డుకు ఆనుకుని 40 అడుగుల కాలువను తవ్వారు.

మృతులు

మృతులు

కానీ కాలువకు రోడ్డుకు మధ్యలో ఎటువంటి సైడ్‌వాల్స్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో బస్సు ఒక్క సారిగి లోయలోకి పడిపోంది. సైడ్‌వాల్స్‌ ఏర్పాటు చేసి ఉంటే ప్రమాద తీవ్రత తగ్గిఉండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో ఆరు మందిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

మిగిలిన వారికి హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పలువురు నేతలు పరామర్శించారు.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

ఈ ప్రమాదంలో మరణంచిన వారిలో అధికశాతం విద్యార్థులే కావడం స్థానికులందరినీ కలచివేసింది. ఈ ఘటనపై గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ బుధవారం మధ్యాహ్నం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గవర్నర్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి మృతుల కుటుంబాలకు ప్రత్యేక సానుభూతి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+