హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌పై విద్యార్థుల ఫైర్, రేవంత్‌కు హెచ్చరిక (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం ఉదయం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు.

ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలను కూడా వెంటనే ప్రకటించాలంటూ క్వార్టర్స్‌ను ముట్టడించిన కార్యకర్తలు లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నిండంతో పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఏబీవీబీ, ఓయు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏబీవీపీ

ఏబీవీపీ

ఫీజు రీయింబర్సుమెంట్స్ విడుదల చేయాలని, ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులు పోలీసులతో వాగ్వాదం దృశ్యం.

ఏబీవీపీ

ఏబీవీపీ

ఫీజు రీయింబర్సుమెంట్స్ విడుదల చేయాలని, ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను అరెస్టు చేస్తున్న పోలీసులు.

ఏబీవీపీ

ఏబీవీపీ

ఫీజు రీయింబర్సుమెంట్స్ విడుదల చేయాలని, ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను అరెస్టు చేస్తున్న పోలీసులు. ఈ సందర్భంగా తోపులాట దృశ్యం.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

గవర్నర్‌కు అధికారాలను కట్టబెట్టే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం కేసీఆర్ రాద్దాంతం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైఖరి పైన తాము దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.

తెరాస

తెరాస

తమ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్‌పై వరుస విమర్శలకు దిగుతున్న కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. మంగళవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు మాట్లాడారు.

తెరాస

తెరాస

కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో పుట్టిన పక్కా తెలంగాణ ద్రోహి అని, వెంకయ్య శిష్యుడిగా తెలంగాణ వ్య తిరేక చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

తెరాస

తెరాస

రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిలరని, ఆయన కాంట్రాక్టర్లను బెదిరించి ఇళ్లు, ఆస్తులు పెంచుకుంటున్నారని, రౌడీగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని, లేకపోతే ఆయన బండారాన్ని బయటపెడ్తామని తెరాస హెచ్చరించింది.

English summary
Photos of ABVP Activists Arrested by police at Old MLA Quarters when Trying to Protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X