లెక్చరర్ మరో పెళ్లి: ప్రియురాలి యాసిడ్ దాడి (పిక్చర్స్)
గుంటూరు: తనను ప్రేమిస్తూ.. వివాహం చేసుకుంటానని నమ్మించిన ప్రియుడి పైన ఓ యువతి యాసిడ్ దాడికి పాల్పడిన సంఘటన శనివారం గుంటూరులోని నగర శివారులో జరిగిన విషయం తెలిసిందే. తనను ప్రేమించి మరొకరిని పెళ్లాడిన అధ్యాపకుడిపై కక్షగట్టిన ప్రియురాలు ఈ యాసిడ్ దాడికి పాల్పడింది.

నల్లపాడులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వెంకటరమణ అనే వ్యక్తి లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఆంధ్రా వర్శిటీలో ఎమ్మెస్సీ (మ్యాథ్స్) ఫైనలియర్ చదువుతున్న యువతితో ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. గత ఆగస్టులో కుటుంబీకుల ఇష్టానుసారం వెంకటరమణ మరో యువతిని పెళ్లాడాడు.
ఇది ప్రియురాలికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఇటీవల సమాచారం తెలుసుకున్న యువతి వెంకటరమణపై కక్షగట్టింది. బుర్ఖా వేసుకుని శనివారం వెంకటరమణ పని చేస్తున్న పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లింది. ఆవరణలో వెంకటరమణ రాక కోసం వేచిచూసి, బయటకు వచ్చిన సమయంలో యాసిడ్‌తో దాడి చేసింది.

వెంకటరమణ ముఖం పూర్తిగా కాలిపోగా, ఆమెకు చేతులపై కూడా యాసిడ్ పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను చూపు కోల్పోయే ప్రమాదముందని తెలుస్తోంది. వెంకటరమణకు కంటి చూపు పూర్తిగా పోయింది. యువతి సౌజన్యను గుంటూరు రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications